AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు క్షేమం.. అక్కడ బోటు కనిపించడంతో..

Andhra Pradesh: చేపల వేటకు వెళ్లి గల్లంతైన శ్రీకాకుళం మత్స్యకారులు క్షేమంగా ఉన్నారు. గల్లంతైన వారి బోటును అధికారులు గుర్తించారు.

Andhra Pradesh: సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు క్షేమం.. అక్కడ బోటు కనిపించడంతో..
Shiva Prajapati
|

Updated on: Jul 20, 2021 | 12:48 PM

Share

Andhra Pradesh: చేపల వేటకు వెళ్లి గల్లంతైన శ్రీకాకుళం మత్స్యకారులు క్షేమంగా ఉన్నారు. గల్లంతైన వారి బోటును అధికారులు గుర్తించారు. అండమాన్ తీరంలో వారి బోటును కనిపెట్టారు అధికారులు. మత్స్యకారులంతా మరో బోట్ సాయంతో ఇవాళ సాయంత్రానికి చెన్నై తీరానికి చేరుకోనున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా, మత్స్యకారుల క్షేమ సమాచారం అందుకున్న మంత్రి అప్పలరాజు.. ప్రభుత్వానికి, అధికారులకు, ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

కాగా, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు గల్లంతైన విషయాన్ని బాధిత కుటుంబాలు మంత్రి అప్పలరాజు దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే స్పందించిన ఆయన సీఎం వైఎస్ జగన్‌కు సమాచారం చేరవేశారు. సంబంధిత అధికారులతో చర్చించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు, ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌ని సమన్వయం చేసుకుని సోమవారం సాయంత్రం నుంచి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చేపట్టారు. అయితే, గల్లంతైన వారి బోటు అండమాన్ తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బోటులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు నిర్ధారించారు.

అయితే, ఈ బోటులో సమస్య కారణంగానే వీరు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారి బోటును మరొక బోట్ సాయంతో ఇవాళ సాయంత్రానికి చెన్నై తీర ప్రాంతానికి తీసుకువస్తామని, బోటులో ఉన్నవారంతా క్షేమంగా ఉన్నారని, వారి కుటుంబ సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా తక్షణమే స్పందించే నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. పాకిస్తాన్ లో చిక్కుకున్న మత్స్యకారులను విడిపించిన సందర్భంలో కానీ… బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకారులను విడిపించి సందర్భంలో గానీ.. మత్స్యకారులకు ఏ సమయంలో ఎలాంటి ఇబ్బంది కలిగిన తక్షణమే స్పందించే ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల అదృష్టమని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. మత్స్యకారుల కష్టాలు తెలిసిన, మత్స్యకారుల జీవితాలు అభివృద్ధి చేయాలన్న గట్టి తలంపుతో ఉన్న నాయకుడు మన సీఎం జగన్ అని పేర్కొన్న మంత్రి అప్పలనాయుడు.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Also read:

Tirumala: మళ్లీ మొరాయించిన టీటీడీ సర్వర్లు.. దొరికిందే ఛాన్స్‌గా రెచ్చిపోతున్న మాయగాళ్లు..

Exams: ఈనెల 25న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష.. హెచ్‌సీయూ ఎంట్రన్స్ ఎగ్జామ్ తేదీల్లో మార్పు..

Hyderabad: చిన్నారిపై తాత లైంగిక దాడి!.. రిపోర్ట్‌లో మాత్రం రివర్స్.. అసలు కారణం అదేనా?