AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చిన్నారిపై తాత లైంగిక దాడి!.. రిపోర్ట్‌లో మాత్రం రివర్స్.. అసలు కారణం అదేనా?

Hyderabad: భాగ్యనగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వృద్ధుడు తన కొడుకు కూతురుపైనే కన్నేశాడు. తొమ్మిదేళ్ల మనవరాలిపై..

Hyderabad: చిన్నారిపై తాత లైంగిక దాడి!.. రిపోర్ట్‌లో మాత్రం రివర్స్.. అసలు కారణం అదేనా?
Pocso Act
Shiva Prajapati
|

Updated on: Jul 20, 2021 | 11:37 AM

Share

Hyderabad: భాగ్యనగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వృద్ధుడు తన కొడుకు కూతురుపైనే కన్నేశాడు. తొమ్మిదేళ్ల మనవరాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని చింతల్‌లో లింగప్ప(65) అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని రెండో కొడుకు కూతురు(9) నాలుగవ తరగతి చదువుతోంది.

అయితే తాత లింగప్ప గత వారం రోజులుగా తనపై లైగింక దాడికి పాల్పడ్డాడని.. పాప తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించారు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షించారు. ఈ రిపోర్ట్స్‌లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. బాలికపై అసలు లైంగిక దాడి జరుగలేదని తేలింది. ఇదే విషయాన్ని పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. అయితే, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి గోడవలు ఉన్నాయని, ఆ ఘర్షణల నేపథ్యంలోనే బాలిక తల్లి ఇలా కేసు నమోదు చేసిందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చిన్నారి తాతపైనా ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Also read:

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు.. అన్నంలో నిద్ర మాత్రలు కలిపి మరీ..

Tirumala: తిరుమల భక్తులకు బ్రేకింగ్ న్యూస్.. ఆగస్టు కోటాకు సంబంధించి రూ. 300 దర్శన టికెట్లు విడుదల..

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో దారుణం.. తాతా, మనవడు మృతి.. వారి ప్రేమ పెళ్లే కారణమా?..