AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల భక్తులకు బ్రేకింగ్ న్యూస్.. ఆగస్టు కోటాకు సంబంధించి రూ. 300 దర్శన టికెట్లు విడుదల..

Tirumala Tirupati Devasthanam: తిరుమల భక్తులకు బ్రేకింగ్ న్యూస్. ఆగస్టు నెల కోటాకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ల..

Tirumala: తిరుమల భక్తులకు బ్రేకింగ్ న్యూస్.. ఆగస్టు కోటాకు సంబంధించి రూ. 300 దర్శన టికెట్లు విడుదల..
Tirumala Temple
Shiva Prajapati
|

Updated on: Jul 20, 2021 | 11:08 AM

Share

Tirumala Tirupati Devasthanam: తిరుమల భక్తులకు బ్రేకింగ్ న్యూస్. ఆగస్టు నెల కోటాకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విడుదల చేసింది. ఇవాళ ఉదయం 9 గంటలకు టికెట్లను టీటీడీ విడుదల చేసింది. రోజుకు 5 వేల టికెట్లు చొప్పున వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆగస్టు నెలలో స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటున్న వారు.. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ టికెట్లు పొందవచ్చు అని తెలిపింది. ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్, ‘గోవింద’ అనే యాప్‌ల ద్వారా టీటీడీ టికెట్లను భక్తులకు జారీ చేస్తున్నారు.

ఇదిలాఉండగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు తొలి ఏకాదశి సంరద్భంగా శ్రీవారి ఆలయాన్ని సర్వాంగం సుందరంగా తీర్చి దిద్దారు ఆలయ అధికారులు. మరోవైపు శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా వచ్చారు. ఇక తొలిఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేదపండితులు. సుప్రబాత సేవ, ఆర్జిత సేవ వంటి ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. తొలిఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ తిరుమలేశుడిని అనేక మంది ప్రముఖులు దర్శించుకున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ హీరో శ్రీకాంత్.. మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. బాలకృష్ణ అఖండ సినిమాలో విలన్‌గా నటిస్తున్న విడుదలపై, ఆయన కొడుకు రోషన్ నటిస్తున్న పెళ్లి సందడి సినిమాపై ఆకస్తికర కామెంట్స్ చేశారు.

ఇక సోమవారం నాడు తిరుమల శ్రీవారిని 17,073 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 1.7 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. సోమవారం నాడు స్వామివారిని దర్శించుకున్న భక్తుల్లో 8,488 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Also read:

సయీద్ అన్వర్‌ను ఇబ్బంది పెట్టిన టీమిండియా పేసర్.. సచిన్‌తో మొరపెట్టుకున్న పాకిస్తానీ బ్యాట్స్‌మెన్!

Minor Arrest: పది కూడా పాస్ కాలేదు.. ఏకంగా ఫారిన్ నెంబర్లతో దడదలాడించేస్తాడు.. కన్నుపడిదంటే అంతే సంగతులు..

Boyapati Srinu : యాక్షన్ హీరోతో బోయపాటి భారీ ప్లాన్.. బాలయ్య సినిమా తర్వాత ఆ హీరోతోనేనా..?