AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode Bypoll: మునుగోడు మొనగాడు ఎవరు..? మరికొన్ని గంటల్లో ఫలితం.. పకడ్బందీగా ఏర్పాట్లు

ఒక్క నియోజకవర్గం. 7 మండలాలు. 30 రోజుల యుద్ధం. 2 లక్షల 41 వేల మంది ఓటర్లు. ముక్కోణపు పోటీ. ఒక్క విజేత! ఆ ఒక్కరూ ఎవరు? కౌంటింగ్‌కు మాత్రం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Munugode Bypoll: మునుగోడు మొనగాడు ఎవరు..? మరికొన్ని గంటల్లో ఫలితం.. పకడ్బందీగా ఏర్పాట్లు
Munugode Bypoll Candidates
Shaik Madar Saheb
| Edited By: Subhash Goud|

Updated on: Nov 06, 2022 | 6:46 AM

Share

తెలంగాణ రాష్ట్రమే కాదు.. దేశం మొత్తం మునుగోడు వైపు చూస్తోంది.! పేరుకు జస్ట్ ఒక రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి జరిగిన బైపోల్ మాత్రమే.! కానీ, దాని వెనుక అంతకుమించిన పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపే ఫలితమిది. అందుకే అన్ని పార్టీల్లోనూ టెన్షన్.! దాదాపు నెల రోజుల పాటు మినీ యుద్ధమే నడిచింది. ఇప్పుడు రిజల్ట్‌ టైమ్‌.! రికార్డుస్థాయిలో పోలింగ్ నమోదైంది. జనం తమ తీర్పు ఇచ్చేశారు. అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు..! ఫలితం ఎలా ఉండబోతోంది? ఎవరు గెలుస్తారు? ఇప్పడు అంతటా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరుగుతోంది.

మునుగోడులో మొత్తం ఓట్లు 2,41 వేల 805. ఇందులో 2,25 వేల 192 ఓట్లు పోలయ్యాయి. అంటే 93.1 శాతం. 2018 ఎన్నికలతో పోలిస్తే దాదాపు 2 శాతం ఓటింగ్ పెరిగింది. ఈ భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం అన్న చర్చ జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. ఇందులో చౌటుప్పల్, సంస్థాన్‌ నారాయణపురం చాలా కీలకం.! ఈ రెండు మండలాల్లోనే దాదాపు లక్ష ఓట్లు ఉన్నాయి. అందుకే పోలింగ్ శాతం. సామాజిక సమీకరణాలపై పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. ఈసారి యూత్‌ కూడా పెద్ద సంఖ్యలో ఓట్లేశారు.. వాళ్లు ఎటువైపు మొగ్గారన్నది కూడా కీలకం కానుంది. మునుగోడు బరిలో చాలా మందే నిలిచారు. కానీ ప్రధాన పోటీ మాత్రం TRS, BJP, కాంగ్రెస్ మధ్యే సాగింది. ప్రస్తుతానికైతే ఎవరి లెక్కలు వారివి. ఎవరి అంచనాలు వారివే. అందరూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నల్లగొండ టౌన్‌లోని వేర్ హౌసింగ్ గోడౌన్‌లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మొదట 686 పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఇక EVMల ఓట్ల కౌంటింగ్ కోసం మొత్తం 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 298 పోలింగ్‌ బూత్‌ల్లోని ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను 15 రౌండ్లలో లెక్కిస్తారు. ఉదయం 9 గంటలకల్లా తొలి ఫలితం వెల్లడయ్యే ఛాన్స్‌ ఉంది. చివరి ఫలితం మధ్యాహ్నం ఒంటిగంటకు వస్తుంది.

ఇవి కూడా చదవండి

మొదట చౌటుప్పల్‌ మండలంలోని ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాల ఈవీఎంలను టేబుళ్ల వద్దకు తరలిస్తారు. లెక్కింపులో పాల్గొనే సిబ్బంది, అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఇక కౌంటింగ్‌ కేంద్రం దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 24 గంటలూ సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీఆర్పీఎఫ్‌ బలగాలు పహారా కాస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..