AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana road accidents: రోడ్లు కావవి.. రక్తచరిత్రకు సాక్ష్యాలు!.. మలుపులు కావవి.. మృత్యుదేవత ఆవాసాలు

అంటే నొచ్చుకుంటారు గానీ.. పాలకులకు ఎప్పుడూ పథకాల మీదే ధ్యాస. చివరికికి ప్రతిపక్షాలకు కూడా. గ్యారెంటీల అమలు ఇంకెప్పుడు అని ఇటువైపు వాళ్ల ప్రశ్న. హామీలిచ్చాం, నెరవేర్చాం అని అటు వైపు వాళ్ల లెక్క. సరిపోతుందా. రాజకీయం అంటే ఇదేనా? ఒక్కో పథకానికి వేల కోట్లు ఖర్చు పెట్టాం అని రొమ్ము విరుచుకుని చెబితే చాలా. లక్షల కోట్లు పోసి మరీ ఉచిత పథకాలు ఇస్తున్నాం అని చెబుతారు. అదే గ్రేటా? విద్య, వైద్యం తరువాత మనిషికి అత్యవసరం రోడ్లే కదా! అర్జెంటుగా ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే రోడ్డెక్కాలి. చదువుకోడానికి వెళ్లాలంటే రోడ్డెక్కాలి. ఉద్యోగానికి వెళ్లాలి.. అంటే రోడ్డెక్కాలి. రోడ్డెక్కితేనే బతుకుబండి నడిచేది. అలాంటి రోడ్లను ఎంత బాగా మేనేజ్‌చేయాలి? మరి ఇప్పుడేం జరుగుతోంది? సూసైడ్లు గట్రా అక్కర్లేదు, రోడ్డెక్కితే చాలు అన్నట్టుగా తయారైందా లేదా? రోజుకెన్ని, నెలకెన్ని, ఏడాదికెన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో, అందులో ఎంతమంది చనిపోతున్నారో డేటా ఉంది కాబట్టే ఇంత ఘాటుగా అనాల్సి వస్తోంది. ఇంతకీ తెలంగాణలో డెత్ స్పాట్‌లు ఎక్కడెక్కడున్నాయ్. ఏ మలుపులో ఎంతమంది చనిపోయారు? ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు?

Telangana road accidents: రోడ్లు కావవి..  రక్తచరిత్రకు సాక్ష్యాలు!.. మలుపులు కావవి.. మృత్యుదేవత ఆవాసాలు
Telangana Road Accidents
Ram Naramaneni
|

Updated on: Nov 04, 2025 | 9:17 PM

Share

పనిచేయని అధికారులను అనాలా. పనిచేయించని ప్రజా ప్రతినిధులను అనాలా? ఇద్దరినీ అనాలేమో. ఎన్నికలొస్తే తప్ప రోడ్లు గుర్తుకు రావు. ఎందుకంటే, కాంట్రాక్టర్ల వెనకున్న నాయకులకు ఎంతో కొంత మిగలాలిగా. అధికారులు కూడా అంతే. వేలకు వేలు రోడ్ ట్యాక్సులు వసూలు చేస్తారు. ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా టోల్ ఫీజులు లాగేస్తారు. మరి.. వసూళ్లకు తగ్గ రోడ్లు ఏవి? అసలు ప్రభుత్వాలే అలా తయారయ్యాయి. ఘోర ప్రమాదం జరిగిన వెంటనే కమిటీలు వేస్తారు. ఏదో కాలం గడిపేయడానికి. ఆ తరువాత షరా మామూలే. అలాంటప్పుడు ఎవరినని ప్రశ్నించేది? రోడ్డు ప్రమాదం అంటే ఒక వ్యక్తి చనిపోవడం కాదు. కుటుంబం మొత్తం రోడ్డున పడడం. ఇంట్లో సంపాదించే వ్యక్తి ఒక్కరు చనిపోతే చాలు.. ఆ వ్యక్తినే నమ్ముకున్న కుటుంబం మొత్తం వీధిన పడుతుంది. వృద్ధులైన తల్లిదండ్రులు, ఇంటిపట్టునే ఉండే ఇల్లాలు, నాన్నే ఆధారంగా జీవిస్తున్న పిల్లలు. ఇంతమంది జీవితాలను నాశనం చేసేది ఒక్క రోడ్డు ప్రమాదం. చేవెళ్ల రోడ్డు ప్రమాదాన్నే తీసుకుందాం. టిప్పర్ డ్రైవర్ తాగి లేడు. మద్యం మీద అపవాదు వేద్దామంటే. టిప్పర్ కాలం చెల్లింది కాదు. జస్ట్ ఏడాది క్రితం కొన్నదే. లోడ్, స్పీడ్ అనేవి ఎప్పుడూ ఉండేవే. మరి.. తప్పెక్కడ కనిపిస్తోంది. కనిపిస్తున్న ఈ గుంత దగ్గరే. గుంతను తప్పించడానికి చేసిన ప్రయత్నం బస్సులోని 19 మంది ఆయువు తీసింది. అప్పటికీ బస్సును రోడ్డు నుంచి కిందకి దింపాడు కూడా. అయినా ఆ రోడ్డు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి