AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: ఇక వరుసగా అల్పపీడనాలు.. ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలెర్ట్..

జోరు వాన కురవాల్సిన జూలై నెలలో ఎండలు మండిపోతున్నాయి. వేసవిలోనే వానలు కురిశాయి. కానీ, ఇప్పుడు వర్షాలే లేవు. ఇవాళ తెలుగురాష్ట్రాల్లో వర్షసూచన ఎలా ఉంది. వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు ఇచ్చిందో ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం మరి. ఓ లుక్కేయండి.

Rain Alert: ఇక వరుసగా అల్పపీడనాలు.. ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలెర్ట్..
Rain Alert
Ravi Kiran
|

Updated on: Jul 15, 2025 | 7:42 AM

Share

సమయానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకినా.. గత కొద్దిరోజులుగా అవి మందగించాయి. అందుకే గడిచిన వారం రోజుల నుంచి అటు ఏపీ, ఇటు తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు మండుతున్నాయి. అటు గాలులు కూడా బలహీనంగా వీస్తుండటంతో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరగడమే కాదు.. ఉక్కపోత కూడా ఎక్కువైంది. ఈ నెలలో ఇప్పటివరకు 30శాతం లోటు వర్షపాతం నమోదైంది. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడితేనే రుతుపవనాల్లో కదిలిక ఉంటుందన్నారు.

మరోవైపు ఏపీలోని కోస్తా, రాయలసీమల్లో ఈనెల 17 నుంచి రాష్ట్రంలో వర్షాలు పెరగనున్నాయి. 18వ తేదీ నుంచి మూడు రోజులపాటు విస్తారంగా, అక్కడక్కడ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గడచిన రెండు వారాలు మధ్య, ఉత్తర భారతాల్లో చురుగ్గా ఉన్న రుతుపవనాలు రానున్న రెండు, మూడు రోజుల్లో దక్షిణాదిలో బలపడనున్నాయి.

అటు తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వల్ల మూడు రోజులు తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే రానున్న రెండు లేదా మూడు రోజుల్లో దక్షిణాదిన రుతుపవనాలు బలపడతాయని.. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో వరుసగ్ అల్పపీడనాలు ఏర్పడే అవకాశముందన్నారు వాతావరణ శాఖ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇల్లు ఊడ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
ఇల్లు ఊడ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి?ఈ రూల్స్ పాటించాల్సిందే
బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి?ఈ రూల్స్ పాటించాల్సిందే
సబ్జా నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
సబ్జా నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీరు తింటున్న కోడిగుడ్డు మంచిదేనా? ఇలా ఈజీగా కనిపెట్టేయండి..!
మీరు తింటున్న కోడిగుడ్డు మంచిదేనా? ఇలా ఈజీగా కనిపెట్టేయండి..!
చెమట జిడ్డుకు పర్మనెంట్ చెక్.. ఎండల్లోనూ ఫ్రెష్‌గా ఉండాలంటే..
చెమట జిడ్డుకు పర్మనెంట్ చెక్.. ఎండల్లోనూ ఫ్రెష్‌గా ఉండాలంటే..
నీట్‌ పరీక్షపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రి
నీట్‌ పరీక్షపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రి
ఇప్పటి వరకు అన్నీ భరించా..ఇక భరించే ఓపికలేదు-పవన్‌
ఇప్పటి వరకు అన్నీ భరించా..ఇక భరించే ఓపికలేదు-పవన్‌
19వ ఆటా తెలుగు మహాసభలకు సీఎంకు రేవంత్ రెడ్డికి ఆహ్వానం
19వ ఆటా తెలుగు మహాసభలకు సీఎంకు రేవంత్ రెడ్డికి ఆహ్వానం
టీమ్ ఆఫ్ ది లీగ్‌.. కెప్టెన్‌గా ప్రిన్స్.. కోహ్లీకి మొండి చెయ్యి
టీమ్ ఆఫ్ ది లీగ్‌.. కెప్టెన్‌గా ప్రిన్స్.. కోహ్లీకి మొండి చెయ్యి
రోహిణి కార్తెలో వంకాయ తింటే ఏమవుతుందో తెలుసా..?
రోహిణి కార్తెలో వంకాయ తింటే ఏమవుతుందో తెలుసా..?