Telangana: రైలు బోగీలో మహిళకు పురిటి నొప్పులు.. పండంటి బిడ్డ జననం
Telangana: రైలు బసర వద్దకు రాగానే ఆ మహిళకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు రైల్వే పోలీస్ సురేశ్, స్టేషన్ మేనేజర్ రవీందర్‌కు సమాచారం అందించారు. అప్పటికే మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వారిని అంబులెన్స్‌లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు..

తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర రైల్వేస్టేషన్ వద్ద గురువారం రైలులోని బోగిలో ఒక మహిళ ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్ర ధర్మాబాద్ మండలం కర్కెళ్లికి చెందిన గర్భిణి నాగేశ్వరి(32) నిజామాబాద్ ఆస్పత్రిలో చూయించుకుని తిరిగి తమ గ్రామానికి వెళ్లేందుకు కాచిగూడ-నాగర్‌సోల్ రైలు ఎక్కింది.
రైలు బసర వద్దకు రాగానే ఆ మహిళకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు రైల్వే పోలీస్ సురేశ్, స్టేషన్ మేనేజర్ రవీందర్‌కు సమాచారం అందించారు. అప్పటికే మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వారిని అంబులెన్స్‌లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని అంబులెన్సు పైలట్ నవీన్ పేర్కొన్నారు. అయితే సకాలంలో స్పందించిన రైల్వే అధికారులకు, సిబ్బందికి, ప్రయాణికులకు దంపతులు అభినందనలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి