TG CPGET 2025 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికాసేపట్లో సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల..
రాష్ట్రవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయెట్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీజీసీపీజీఈటీ-2025 ఎంట్రన్స్ పరీక్ష నోటిఫికేషన్ శుక్రవారం (జూన్ 12) విడుదలవనుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి..

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయెట్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీజీసీపీజీఈటీ-2025 ఎంట్రన్స్ పరీక్ష నోటిఫికేషన్ శుక్రవారం (జూన్ 12) విడుదలవనుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తుంది. టీజీసీపీజీఈటీ-2025 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, ప్రొఫెసర్ కుమార్ మొలుగరామ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటనలో వెల్లడించారు. సీపీగెట్ నోటిఫికేషన్ కింద రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, వీరనారి చాకలిఐలమ్మ, జేఎన్టీయూల పరిధిలో యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టనున్నారు.
దోస్త్ తొలి విడతలో 41 వేల మందికి సీట్లు.. నేడు రెండో విడత సీట్ల కేటాయింపు
రాష్ట్రంలోని కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తైది. తొలి విడతలో మొత్తం 60,428 మందికి సీట్లు కేటాయించారు. ఇందులో 41,285 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో 33,409 మంది ఫీజు చెల్లించి దరఖాస్తు చేశారు. తొలి విడతలో సీట్లు దక్కిన వారిలో దాదాపు 13 వేల మందికిపైగా మెరుగైన కళాశాల, సీటు కోసం మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. రెండో విడత సీట్లు కేటాయింపు ఫలితాలు జూన్ 13వ తేదీన విడుదలకానున్నాయి.
ఏపీపీఎస్సీ అటవిశాఖ ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలో..
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఆఫ్‌లైన్ విధానంలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన కొత్త సిలబస్‌ను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.