Rain Alert: బిగ్ అలర్ట్.. తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ సారి ఉరుములు, మెరుపులే
తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో తెలికపాలి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో తేటికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఆదివారం దక్షిణ అండమాన్ సముద్ర సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం సోమవారం కూడా ఇంచుమించు అదే ప్రాంతంలో కొనసాగుతూ సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ ఎత్తువరకు విస్తరించినట్టు వాతావరణశాఖ తెలిపింది.
ఈ ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. అది రాబోయే 48 గంటల్లో పశ్చిమ,వాయువ్య దిశలో కదులుతూ దక్షిణ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు.మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగంతో కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




