Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌పై కుట్ర.. ఎన్‌జీటీ కేసు వెనక అదృశ్య శక్తులు: మంత్రి జగదీశ్ రెడ్డి
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌పై కుట్ర జరుగుతోందని మంత్రి ఆరోపించారు. పనులు నిలిపివేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఏకపక్షంగా ఉందన్నారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ( NGT) తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌పై కుట్ర జరుగుతోందని మంత్రి ఆరోపించారు. పనులు నిలిపివేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఏకపక్షంగా ఉందన్నారు. వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టాక, ఇప్పుడు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇవ్వడం సరైంది కాదన్నారు జగదీశ్‌రెడ్డి. ఎన్‌జీటీ ఇచ్చిన తీర్పు, కేవలం తెలంగాణకే కాదు… యావత్ దేశానికే నష్టం కలిగించేలా ఉందన్నారు. అన్ని పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఎక్కడో ఉండే ముంబై కంపెనీ… తెలంగాణలోని పవర్ ప్లాంట్‌పై పిటిషన్ వేయడం వెనక కచ్చితంగా కుట్ర ఉందన్నారు.
ఎన్‌జీటీలో కేసు వేసిన ముంబై సంస్థ వెనక అదృశ్య శక్తులు ఉన్నాయన్నారు మంత్రి జగదీశ్‌రెడ్డి. అయినా, యాదాద్రి పవర్ ప్లాంట్‌కి, ముంబై సంస్థకు సంబంధం ఏంటని ప్రశ్నించారు మంత్రి. గతంలో ఇదే కంపెనీ వేసిన పిటిషన్‌ను ఎన్‌జీటీ కొట్టివేసిందని, కానీ ఇప్పుడు రివర్స్‌లో తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. పైగా, ముంబై సంస్థ లేవనెత్తిన అంశాలన్నీ పూర్తిగా అసంబద్ధంగా ఉన్నాయన్నారు జగదీశ్‌రెడ్డి. అన్ని చట్టాలకు లోబడే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందన్న ఆయన ఎన్‌జీటీ తీర్పుపై త్వరలోనే రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. ఏదిఏమైనాసరే, అనుకున్న సమయానికే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం కంప్లీట్‌చేసి విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామన్నారు మంత్రి.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
