AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫలక్‌నుమా అగ్ని ప్రమాదం: ప్రమాదం ముందే పసిగట్టి వేలమంది ప్రాణాలు నిలబెట్టింది ఇతనే

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య గత శుక్రవారం (జులై 7) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. అందరూ చూస్తుండగానే ఆరు బోగీలు కాలిబూడిదయ్యాయి. సమయానికి అధికారులు, ప్రయాణీకులు అప్రమత్తం కావడంతో..

ఫలక్‌నుమా అగ్ని ప్రమాదం: ప్రమాదం ముందే పసిగట్టి వేలమంది ప్రాణాలు నిలబెట్టింది ఇతనే
Falaknuma Express Fire Accident
Srilakshmi C
|

Updated on: Jul 10, 2023 | 7:03 AM

Share

జిన్నారం: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య గత శుక్రవారం (జులై 7) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. అందరూ చూస్తుండగానే ఆరు బోగీలు కాలిబూడిదయ్యాయి. సమయానికి అధికారులు, ప్రయాణీకులు అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తేల్చిచెప్పినా పలు ఎన్నో అనుమానాలు నివురుగప్పిన నిప్పులా వెంటాడుతూనే ఉన్నాయి. ఐతే ఈ ప్రమాద సమయంలో సిగిల్ల రాజు అనే యువకుడు చూపిన సమయస్పూర్తి ఎందరో ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టి ట్రైన్‌ చైన్‌ లాగి వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. పాతపట్నం సమీపంలోని చిన్న మల్లెపురానికి చెందిన రాజు ఐడీఏ బొల్లారం పుర పరిధిలోని లక్ష్మీనగర్‌లో పదేళ్లుగా అద్దె ఇంట్లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..

పలాసలో అమ్మ పార్వతి, చెల్లి పావని, పెద్దమ్మ బృందావతితో కలిసి ఉదయం 11 గంటల సమయంలో రాజు ఎస్‌4 బోగిలో ఎక్కి కూర్చున్నారు. పై బెర్తులో పడుకొన్న రాజుకు ఒక్కసారిగా రబ్బరు కాలిన వాసన వచ్చింది. దానితోపాటు ట్రైన్‌ పై భాగం నుంచి వేడిగా అనిపించడంతో ఎంత వల్లనేమోనని తొలుత అనుకున్నాడు. అంతలోనే వాసన మరింత ఎక్కువవడంతో కిందికి దిగి కిటికీలోంచి చూస్తూ రైలు నుంచి దట్టమైన పొగ రావడం గమనించాడు.

వెంటనే చైన్‌ లాగిన రాజు కేకలు వేసి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత అగ్నిమాపక కేంద్రానికి, 108కు సమాచారం అందిచాడు. ప్రమాద కేంద్రం రాజు కుటుంబం కూర్చున్న బెర్తు వద్దనే ఉండటంతో కుటుంబాన్ని తొలుత కిందకి దించాడు. అలాగే తోటి ప్రయాణికులను కూడా సహకరిస్తున్న క్రమంలో పొగను ఎక్కువగా పీల్చడంతో రాజు స్పృహతప్పి పడిపోయాడు. అశ్వస్థతకు గురైన వారందరినీ భువనగిరి ఆసుపత్రికి తరలించారు. ఇలా ప్రమాదాన్ని ముందే పసిగట్టడమేకాకుండా చైన్‌ లాగి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో రాజు వేలాది ప్రయాణికులు ప్రాణాలు కాపాడాడు. ఐదారు నిమిషాలు ఆలస్యమైనా తీరని నష్టం జరిగేది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.