Makeup Remover: సహజ పద్ధతుల్లో ఇలా సులువుగా మేకప్ తొలగించుకోండి..
కోమలాంగులు అందంగా అలంకరించుకుని రోజంతా మేకప్‌లోనే గడిపేస్తుంటారు. ఐతే రాత్రి నిద్రపోయే ముందు మాత్రం మేకప్‌ను తప్పనిసరిగా తొలగించుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు. అందుకు మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన మేకప్ రిమూవర్స్ బదులుగా ఇంట్లోనే లభించే సహజమైన పదార్థాలతో ఇలా..
Updated on: Jul 09, 2023 | 4:20 PM

మేకప్ తొలగించుకోవడానికి మేకప్ రిమూవర్స్ వాడితే చర్మం త్వరగా పొడిబారి, నిర్జీవంగా తయారవుతంది. కొబ్బరినూనెను సహజ రిమూవర్‌గా వినియోగించుకోవచ్చంఉటన్నారు నిపుణులు. కొబ్బరినూనెను ముఖానికి, మెడకు బాగా పట్టించి 2, 3 నిమిషాల తర్వాత కాటన్ ప్యాడ్లతో తుడిచేస్తే సరి.

పాలతో కూడా మేకప్‌ను తొలచుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలో పాలు తీసుకొని, అందులో కాటన్ బాల్‌ను ముంచి దానితో ముఖాన్ని శుభ్రంగా తుడిచేసుకుంటే ఇట్టేపోతుంది.

తేనె కూడా న్యాచురల్ మేకప్ రిమూవర్‌గా ఉపయోగించవచ్చు. కాటన్ బాల్‌పై కాస్త తేనె వేసి దానితో ముఖంపై మసాజ్ చేసినట్లుగా మృదువుగా 5 నిమిషాల పాటు మర్దనా చేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.

ఆవిరి స్టీమింగ్‌తో ముఖంపై వేసుకున్న మేకప్‌ను నిమిషాల్లో తొలగించుకోవచ్చు. ఒక గిన్నెలో వేడి నీళ్లను తీసుకొని 5-10 నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. ఆ తర్వాత కాటన్ క్లాత్ లేదా కాటన్ బాల్‌తో ముఖాన్ని తుడిచేసుకుంటే మేకప్ మొత్తం చెమటతో పాటు తొలగిపోతుంది. చర్మ రంధ్రాలు తెరచుకొని ఇతర మురికి కణాలు కూడా పోతాయి.