Telangana: ఇదేం పాడు బుద్ధి.. ఏటీఎం నుంచి రూ.77 లక్షల నగదు కాజేసిన సిబ్బంది!
డబ్బు కోసం ఆ అధికారుల బుద్ధి గడ్డితినింది. ఏటీఎం మెషీన్లలో డబ్బులు పెట్టేందుకు వెళ్లి భారీగా నగదును దోచేశారు. దాదాపు రూ.77 లక్షల వరకు డబ్బు పక్కదారి పట్టించారు. అనుమానం వచ్చిన కంపెనీ ఇంటర్నల్ ఆడిటర్ ఆరా తీయగా అసలు బండారం బయటపడింది. ఈ షాకింగ్ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పాల్వంచ, మే 13: డబ్బు కోసం ఆ అధికారుల బుద్ధి గడ్డితినింది. ఏటీఎం మెషీన్లలో డబ్బులు పెట్టేందుకు వెళ్లి భారీగా నగదును దోచేశారు. దాదాపు రూ.77 లక్షల వరకు డబ్బు పక్కదారి పట్టించారు. అనుమానం వచ్చిన కంపెనీ ఇంటర్నల్ ఆడిటర్ ఆరా తీయగా అసలు బండారం బయటపడింది. ఈ షాకింగ్ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వరంగల్ జిల్లా హనుమకొండలోని సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకుల నుంచి నగదు తీసుకొని ఏటీఎం మెషీన్లలో అమర్చుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం-2 ఎంక్లైన్‌కు చెందిన ములుగురి రాజశేఖర్, కొత్తగూడెం గాజులరాజంతోపాటు బస్తీకి చెందిన కందుకూరి సందీప్ అనే ముగ్గురు వ్యక్తులు ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు ఆ ఏజెన్సీ నుంచి నగదు తీసుకుని కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లోని పలు చోట్ల ఉన్న ఏటీఎం సెంటర్లలో డబ్బులు పెడుతుంటారు.
ఈక్రమంలో వీరు తాజాగా కొత్తగూడెం, పాల్వంచ ఏటీఎంలలో నగదు పెట్టేందుకు వెళ్లారు. అయితే ఆయా ఏటీఎంలలో మొత్తం రూ.76,77,400 మేర లెక్కల్లో తేడా కనిపించింది. దీనిని ఆ కంపెనీ ఇంటర్నల్ ఆడిటర్ రాజు మే 8వ తేదీన గుర్తించారు. ఈ విషయమై రాజు విచారించగా.. రాజశేఖర్, సందీప్ అనే ఇద్దరు వ్యక్తులు కంపెనీని మోసం చేసి ఆ మొత్తాన్ని కాజేసినట్లు గ్రహించాడు. వెంటనే కంపెనీ మేనేజర్ జితేందర్‌కు విషయం తెలియజేయగా.. ఆయన పాల్వంచ పట్టణ పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బాణాల రాము మీడియాకు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.