Hyderabad: క్యూలైన్‎లో నిల్చొని ఓటు వేసిన అల్లు అర్జున్, సతీమణితో కలిసి ఓటేసిన జూనియర్ ఎన్టీఆర్..

తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నారు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు. తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకే ప్రారంభమైన నేపథ్యంలో జూబ్లీహిల్స్‎లో తన సతీమణితో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన భార్య ప్రణితతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. పాన్ ఇండియా స్టార్ హీరో అల్లూ అర్జున్ కూడా తనకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

Hyderabad: క్యూలైన్‎లో నిల్చొని ఓటు వేసిన అల్లు అర్జున్, సతీమణితో కలిసి ఓటేసిన జూనియర్ ఎన్టీఆర్..
Jr. Ntr, Allu Arjun
Follow us
Srikar T

|

Updated on: May 13, 2024 | 8:26 AM

తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నారు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు. తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకే ప్రారంభమైన నేపథ్యంలో జూబ్లీహిల్స్‎లో పాన్ ఇండియా స్టార్ హీరో అల్లూ అర్జున్ కూడా తనకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చారు హీరో అల్లు అర్జున్‌. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి పిలుపునిచ్చారు అల్లుఅర్జున్. అలాగే తన సతీమణితో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన భార్య ప్రణితతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.

ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగి మాజీ మంత్రి కిషన్ రెడ్డి తన భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. వేసవి తాపం ఎక్కువగా ఉండటంతో ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..