Elections 2024: ఎన్నికల ఎఫెక్ట్.. 3 రోజుల్లోనే సొంతూళ్లకు పయనమైన 1.42 కోట్ల జనాలు! ఆ రికార్డ్ బ్రేక్ చేసిన TSRTC

సార్వత్రిక ఎన్నికల వేళ ఓటేసేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న జనాలు సొంతూళ్లకు పోటెత్తారు. ఈ సారి సంక్రాంతి రికార్డును టీఎస్‌ఆర్టీసీ బ్రేక్‌ చేసేసింది. సాధారణంగా ప్రతీయేట సంక్రాంతి సీజన్‌తో అత్యధికంగా ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటారు. అయితే సంక్రాంతితో పోలిస్తే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దాదాపు 10 శాతానికి పైగా ప్రయాణికులు ఆర్టీసీని వినియోగించుకున్నట్లు..

Elections 2024: ఎన్నికల ఎఫెక్ట్.. 3 రోజుల్లోనే సొంతూళ్లకు పయనమైన 1.42 కోట్ల జనాలు! ఆ రికార్డ్ బ్రేక్ చేసిన TSRTC
Telangana RTC Bus Services for Elections
Follow us
Srilakshmi C

|

Updated on: May 13, 2024 | 7:03 AM

హైదరాబాద్‌, మే 13: సార్వత్రిక ఎన్నికల వేళ ఓటేసేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న జనాలు సొంతూళ్లకు పోటెత్తారు. ఈ సారి సంక్రాంతి రికార్డును టీఎస్‌ఆర్టీసీ బ్రేక్‌ చేసేసింది. సాధారణంగా ప్రతీయేట సంక్రాంతి సీజన్‌తో అత్యధికంగా ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటారు. అయితే సంక్రాంతితో పోలిస్తే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దాదాపు 10 శాతానికి పైగా ప్రయాణికులు ఆర్టీసీని వినియోగించుకున్నట్లు టీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది.

మే 9 నుంచి 11వ తేదీ వరకు సుమారు 1.42 కోట్ల మందికిపైగా ఆర్టీసీలో ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల ముందే రైల్వేలో అన్ని సీట్లు రిజర్వ్‌ కావడంతో అధిక మంది జనాలు బస్సు మార్గంలో ప్రయాణించేందుకు మొగ్గు చూపారు.

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైపునకు ఇప్పటివరకు దాదాపు 590 స్పెషల్‌ బస్సులను టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ – విజయవాడ రూట్‌లోనే దాదాపు 140 సర్వీసులను ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం పెట్టింది. ఈ బస్సుల్లో దాదాపు 3 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉంచింది. తెలంగాణ ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లను ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ కోరింది. హైదరాబాద్‌ నుంచి 1500 ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతుంది. జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సుల సర్వీసులు నడుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!