Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరట.. సోమవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే
గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగడం లేదా, స్వల్పంగా తగ్గడం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే సోమవారం బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇది తక్కువే అయినా ధరల పెగుదలకు తగ్గుముఖం పట్టిందని బంగారం ప్రియులు ఖుషీ అవుతున్నారు. కాగా ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర...
గతకొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా ఎలా దూసుకుపోయాయో అందిరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో తులం బంగారం కచ్చితంగా రూ. లక్షకు చేరుకుంటుందని అంతా భావించారు. ఆ రేంజ్‌లో బంగారం ధరలు పెరిగాయి. అయితే తర్వాత క్రమంగా గోల్డ్ రేట్స్ కంట్రోల్‌లోకి రావడం ప్రారంభించాయి.
గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగడం లేదా, స్వల్పంగా తగ్గడం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే సోమవారం బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇది తక్కువే అయినా ధరల పెగుదలకు తగ్గుముఖం పట్టిందని బంగారం ప్రియులు ఖుషీ అవుతున్నారు. కాగా ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,240గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,350 వద్ద కొనసాగుతోంది. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,390గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,500గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,240కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,350 వద్ద కొనసాగుతోంది.
* ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,490, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,630గా ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ. 67,240కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,350 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
* హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రామల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,240గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 73,350 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,240కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,350గా ఉంది.
* విశాఖఫట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,240కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,350 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇక వెండి ధరల్లోనూ తగ్గుదల కనిపిచింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 86,900కి చేరింది. ఢిల్లీతో పాటు కోల్‌కతా ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 86,900గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నైలో సిల్వర్ రేట్ అత్యధికంగా రూ. 90,400 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..