PK with KCR: కేసీఆర్ వ్యూహం వెనుక ప్రశాంత్ కిశోర్?.. అసలు స్ట్రాటజీ ఇదేనా?.. ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..
PK with KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కె. చంద్రశేఖర్ రావు(KCR) వ్యూహం వెనుక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) ఉన్నారా?....
PK with KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కె. చంద్రశేఖర్ రావు(KCR) వ్యూహం వెనుక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) ఉన్నారా?.. గత కొద్ది కాలంగా కేసీఅర్ అయనతో టచ్‌లో ఉన్నారనేది రాజకీయవర్గాల్లో(Indian Politics) వినిపిస్తున్న టాక్. నిజానికి రాజకీయ వ్యూహల్లో(Political Strategy) కేసీఅర్ ఉద్దండుడు. అయనకు ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యూహకర్తలతో పెద్దగా అవసరం ఉండదు. పొలిటికల్ అసిస్టెన్స్ ఏజెన్సీలు మెదలుకాని రోజుల్లోనే కేసీఅర్ సర్వేలు చేయించుకుని అందుకు తగ్గట్టుగా రాజకీయ వ్యూహలను మార్చుకుంటూ వెళ్లేవారు. తెలంగాణ ఎర్పాటు సమయంలో, తెలంగాణ ఎర్పడ్డాక కూడా కేసీఅర్ స్ట్రాటజీలు చాలామంది ప్రాంతీయ పార్టీల నేతలను ఆకర్శించాయి. కేసీఅర్ ప్రవేశపెట్టిన పథకాలు కూడా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు అనుసరించాయి. ఒక రకంగా చెప్పాలంటే కెసీఅర్ ఓక అప్‌డేటెడ్ పొలిటిషియన్.
కాని ఇప్పుడు అయన ఎందుకు ప్రశాంత్ కిశోర్‌తో జతకడుతున్నారు. అయనను ఎందుకని కన్సల్టెంట్‌గా నియమించుకుంటున్నారు. ఇందుకు కారణం కేసీఅర్ అందుకున్న జాతీయ రాజకీయాల నినాదం. గత పార్లమెంటు ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటూ కొద్ది నెలలు హడావుడి చేసిన అయన ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు. 2019 ఎన్నికల్లో సరైన వ్యూహం లేకపోవడంతో పాటు కలిసివచ్చే నేతల తోడు లేకపోవడం మైనస్‌గా మారింది. అయితే అప్పటికి ఇప్పటికి కేసీఅర్ ఇంకా బలమైన నేతగా మారారు. మరోవైపు బీజేపీ దేశవ్యాప్తంగా బలపడుతుంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తీప్పాలనుకున్న కేసీఅర్ కు పీకే మంచి అప్షన్‌గా కనిపించారు. దేశంలో ఉన్న అనేకమంది ప్రాంతీయ పార్టీల నేతలతో మంచి సంబందాలున్న ప్రశాంత్ కిశోర్.. నేషనల్ ప్లాట్‌ఫాంకు మంచి కో అర్డినేటర్ గా పనిచేస్తారని కేసీఅర్ అంచనా వేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రగతి భవన్‌లో పీకే టీంతో ఒకసారి భేటీ అయిన కేసీఅర్ బృందం ప్రాధమిక చర్చలు జరిపినట్లు సమాచారం. కేసీఅర్ నిర్వహించబోయే మాజీ సివిల్స్ అధికారుల సమావేశానికి కూడా తెరవెనుక పీకే ఉన్నారని పార్టిలో అందుతున్న సమాచారం.
ఇప్పటివరకు వివిధ రాజకీయ పార్టీలతో పీకే అందించిన సేవలు, పనిచేసిన విధానం వేరు. కాని ఇప్పుడు కేసీఅర్‌తో పనిచేయనున్న స్టైల్ వేరు. ఇప్పటిదాక మమతా బెనర్జీకి, జగన్, లాలు ప్రసాద్ యాదవ్ లాంటి వారికి రాజకీయ వ్యూహలతో పాటు, ప్రసంగాలు, సర్వేలు, ప్రకటనలు అన్నీ తానై పీకే టీం పనిచేసింది. కాని కేసీఅర్ మాత్రం అయనను రాజకీయ పార్టీలకు అనుసంధానకర్తగా వినియోగించుకోనున్నారు. ఇప్పటికే బీజేపీకి, కాంగ్రెస్‌కు వ్యతిరేఖంగా ఉన్న ప్రశాంత్ కిశోర్ థర్డ్ ఫ్రంట్‌కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఅర్ కూడా రెండు జాతీయ పార్టీలను కాదని ఓ రాజకీయ వేధికను స్థాపించే పనిలో ఉన్నారు. ఇందుకోసం దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు, శక్తులతో సమాలోచనలు జరిపి కేసీఅర్ ఉద్దేశాలను వివరించే పనిలో పీకే టీం ఉందని సమాచారం. రాబోయే రోజుల్లో పీకే.. కేసీఅర్ తో కలిసి మరింత బలంగా పనిచేస్తారని.. అవసరమైతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోనూ టీఅర్ఎస్ తరఫున పీకే టీమ్ పనిచేస్తుందని తెలుస్తోంది. మరి ఫ్యూచర్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే పరిస్థితులను గమనిస్తూ ఉండాలి.
-రాకేష్, టీవీ9 తెలుగు, హైదరాబాద్.
Also read:
చిన్న చెక్క ఇల్లు.. అమ్మితే కోట్లు వచ్చాయి !! ఎందుకో తెలుసా ?? వీడియో
రూ. 5వేల బడ్జెట్‌లో ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌లు ఇవే !! వీడియో