Hyderabad: అసెంబ్లీ ఎదురుగా రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం..
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి స్పాట్ లోనే చనిపోయాడు.
Hyderabad Accident: తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి స్పాట్ లోనే చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ ఉద్యోగి మురళి కృష్ణ స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు కింద పడ్డాడు మురళి కృష్ణ. బస్సు వెనుక టైరు ఎక్కడంతో మురళి కృష్ణ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మురళి కృష్ణ ఐడీ కార్డు చూడగా జీహెచ్ఎంసీ ఐడీ కార్డు కనిపించింది. దాంతో అతని వివరాలను ధృవీకరించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మురళి కృష్ణ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
చాణక్య నీతి: భార్యాభర్తల మధ్య ఈ విషయాల ప్రస్తావన రాకూడదు.. వచ్చిందంటే బంధం బలహీనం..?
Flying Fish: గాల్లో ఎగిరే చేపలను చూశారా ఎప్పుడైనా !! వీడియో
గంటకు 417 కి.మీ. వేగం !! దూసుకెళ్లిన బుగాటీ కారు.. చివరికి ?? వీడియో