Flying Fish: గాల్లో ఎగిరే చేపలను చూశారా ఎప్పుడైనా !! వీడియో

Flying Fish: గాల్లో ఎగిరే చేపలను చూశారా ఎప్పుడైనా !! వీడియో

Phani CH

|

Updated on: Feb 05, 2022 | 5:57 PM

ఈ ప్రపంచం ఒక అద్భుతాల గని.. మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలు ఈ భూమండలంపై దాగి ఉన్నాయి. తాజాగా ఎగిరే చేపగురించి మనం తెలుసుకోబోతున్నాం.

ఈ ప్రపంచం ఒక అద్భుతాల గని.. మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలు ఈ భూమండలంపై దాగి ఉన్నాయి. తాజాగా ఎగిరే చేపగురించి మనం తెలుసుకోబోతున్నాం. చేపలు ఎగరడమేంటి అనుకుంటున్నారా.. నిజం.. అదే వాటి ప్రత్యేకత. ఫ్లైయింగ్ ఫిష్‌, ఫ్లైయింగ్‌ కాడ్‌, కొల్లోక్వియల్లి అని దీనికి రకరకాల పేర్లు. ఇవి సముద్రాల్లో పెరుగుతాయి. వీటిలో దాదాపు 64 రకాల జాతులున్నాయి. సాధారణంగా చేపలకు నీటిలో ఈదడానికి వీలుగా పలుచని రెక్కలులాంటివి ఉంటాయి కదా. ఈ చేపలకు మాత్రం విసనకర్ర లాంటి పెద్ద రెక్కలు ఉంటాయి. వాటితోనే ఇవి గాల్లో ఎగురుతాయి. నీటిలో ఉన్నప్పుడు మామూలు చేపల్లాగే ఆ రెక్కలతో ఈదుతాయి.. గాల్లోకి ఎగరగానే… పక్షుల రెక్కలలా పెద్దగా విచ్చుకునేలా చేసుకుంటాయి. ఇలా రెండు రకాలుగా చేస్తూ… ఇవి గాల్లో దూసుకెళ్తాయి. మరీ పక్షుల రేంజ్ లో ఎగరవు కానీ.. కొద్దిపాటి ఎత్తువరకు ఎగరగలవు.

Also Watch:

గంటకు 417 కి.మీ. వేగం !! దూసుకెళ్లిన బుగాటీ కారు.. చివరికి ?? వీడియో

Viral Video: బుల్లెట్‌ బండిపై పెళ్లి మండపానికి దూసుకొచ్చిన వధువు !! వీడియో

కూతురు బర్త్ డే అని చాక్లెట్ ప్యాకెట్ కొన్నాడు.. విప్పి చూస్తే షాక్ !! వీడియో

ఇక్కడ బేరాలు లేవమ్మా.. కూరగాయలు అమ్ముతున్న కోతి !! వీడియో