కూతురు బర్త్ డే అని చాక్లెట్ ప్యాకెట్ కొన్నాడు.. విప్పి చూస్తే షాక్ !! వీడియో

తన పుట్టినరోజునాడు తన స్నేహితులందరికీ చాక్లెట్స్‌ పంచాలనుకున్న ఓ చిన్నారికి చేదు అనుభవం ఎదురైంది. నెల్లూరు జిల్లా కోవూరుకి చెందిన రఘురాం..

Phani CH

| Edited By: Ravi Kiran

Feb 05, 2022 | 5:52 PM

తన పుట్టినరోజునాడు తన స్నేహితులందరికీ చాక్లెట్స్‌ పంచాలనుకున్న ఓ చిన్నారికి చేదు అనుభవం ఎదురైంది. నెల్లూరు జిల్లా కోవూరుకి చెందిన రఘురాం ఇటీవల తన కుమార్తె బర్త్ డే సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ షాపులో చాక్లెట్ బాక్స్ కొన్నాడు. అయితే బర్త్ డే రోజున ఆ చాకెట్లను పరిశీలిస్తే అన్నీ పురుగులే ఉన్నాయి. అదేంటని షాపు యజమానిని ప్రశ్నిస్తే.. అస్సలు పట్టించుకోలేదు. దీంతో రఘురాం తన పిల్లల్ని తీసుకుని నేరుగా తహశీల్దార్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న షాపుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. అంతేకాదు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా సమాచారం అందించాడు.

Also Watch:

ఇక్కడ బేరాలు లేవమ్మా.. కూరగాయలు అమ్ముతున్న కోతి !! వీడియో

ఐదేళ్ల క్రితం పొట్టివాడంటూ ఎగతాళి !! నేడు ఆ బాలుడే ఓ బాహుబలి !! వీడియో

నదిలో టూరిస్టుల బోటింగ్‌ !! ఇంతలో భారీ వింత చేప !! వీడియో

రూ. 5వేల బడ్జెట్‌లో ఇండియాలో బెస్ట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌లు ఇవే !! వీడియో

అతను స్నానం చేసి 67 ఏళ్లయిందట !! అయినా ఆరోగ్యంగా !! ఎలా ?? వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu