Viral Video: పక్షి గూడు కోసం గడ్డిని ఎలా సేకరించి తీసుకెళ్తుందో తెలుసా? ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే..

గూడు కట్టుకోవడానికి గడ్డిని సేకరిస్తున్న ఓ చిన్న పక్షిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Viral Video: పక్షి గూడు కోసం గడ్డిని ఎలా సేకరించి తీసుకెళ్తుందో తెలుసా? ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే..
Bird Viral Video
Follow us

|

Updated on: Feb 05, 2022 | 5:43 PM

Viral Video: భూమిపై ఉన్న అన్ని జీవులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే గూడు కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పక్షులను మీరు చాలాసార్లు చూసే ఉంటారు. కానీ, గూడు కోసం గడ్డిన ఎలా సేకరించి తీసుకెళ్తుందో మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలియకుంటే కచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. చలి, వేడి, ఎండ నుంచి తమను తాము రక్షించుకోవడానికి పక్షులు(Birds) తరచుగా గూళ్లు నిర్మించుకుంటాయి. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్(Viral Video) అవుతోంది. ఇందులో ఒక అందమైన పక్షి గడ్డిని ఎలా సేకరిస్తుంది, వాటిని ఎలా మోసుకెళ్తుందో చూసిన నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. ఈ పక్షి చెట్ల ఆకుల నుంచి కాడలను సేకరిస్తూ తన రెక్కల్లో దాచుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ప్రతీ ఆకు నుంచి కాడలను తన నోటితో వేరు చేసి రెక్కల మధ్యలో దాచుకుంటుంది.

తన గూడు కోసం పుల్లలను సేకరించే ఈ చిన్న పక్షి ప్రకృతి అందాలకు ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక చిన్న పక్షి గూడు నిర్మించడానికి ఎంత నైపుణ్యంతో కష్టపడుతుందో స్పష్టంగా చూడొచ్చు. మీరు బహుశా ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వీడియోని చూసి ఉండరు. ఈ అందమైన పక్షి చెట్ల కొమ్మల మధ్యలో ఉన్న ఆకుల నుంచి కాడలను బయటకు తీయడం ఇందులో చూడవచ్చు. ఆ తరువాత ఒకేసారి చాలా స్ట్రాలను తీసుకెళ్లి తన గూడును నిర్మించుకుంటుంది.

తన గూడు తయారు చేసేందుకు గడ్డిని సేకరిస్తున్న పక్షి వీడియో చాలా మందిని ఆకర్షిస్తోంది. ఈ అందమైన వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా శుక్రవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పటికే 60 వేలకు పైగా వ్యూస్‌తో నెట్టింట్లో దూసుకపోతోంది. ఈ పక్షి నైపుణ్యా్ని ప్రకృతిలో అత్యంత నైపుణ్యం కలిగిన వాస్తుశిల్పులలో ఒకటిగా పరిగణించాల్సిందేనంటూ దీపాంశు కబ్రా పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆకుపచ్చ, నీలం రంగు పక్షి కొలంబిడే కుటుంబానికి చెందినది తెలుస్తోంది.

Also Read: Viral Video: తొలిసారి ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేసిన స్పెయిన్ యువతి.. ఫస్ట్ ఎక్స్‌ఫ్రెషన్ అద్దిరిపోయిందబ్బా..!

Viral Video: గుడ్ల కోసం గూట్లోకి దూరిన పాము.. పట్టపగలే చుక్కలు చూపించిన పిట్టలు.. షాకింగ్ వీడియో..