Viral Video: తొలిసారి ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేసిన స్పెయిన్ యువతి.. ఫస్ట్ ఎక్స్‌ఫ్రెషన్ అద్దిరిపోయిందబ్బా..!

Viral Video: స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు చెందిన ఓ యువతి తన జీవితంలోనే తొలిసారిగా భారతీయ ఆహారాన్ని రుచి చూసింది. ఈ సందర్భంగా ఆమె మొహంలో కనిపించిన హావభావాలు..

Viral Video: తొలిసారి ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేసిన స్పెయిన్ యువతి.. ఫస్ట్ ఎక్స్‌ఫ్రెషన్ అద్దిరిపోయిందబ్బా..!
Follow us

|

Updated on: Feb 05, 2022 | 4:29 PM

Viral Video: స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు చెందిన ఓ యువతి తన జీవితంలోనే తొలిసారిగా భారతీయ ఆహారాన్ని రుచి చూసింది. ఈ సందర్భంగా ఆమె మొహంలో కనిపించిన హావభావాలు చూస్తే ‘‘ఇందెదయ్యా ఇది.. ఇది నేనెప్పుడూ సూడలే’’ అని అనిపించక మానదు. ఆమె మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయి మరి. ఇండియన్ ఫుడ్ టేస్ట్‌కు ఆ యువతి ఓ రేంజ్‌లో ఫిదా అయిపోయింది. ఇంత మంచి, టేస్టీ ఫుడ్‌ను నా జీవితకాలంలో తినకుండా ఉన్నానా? అంటూ కాస్త ఫీల్ అయి.. ఆ తరువాత ఎగ్జైట్ అయ్యింది. మొదట కొంచెం ఫుడ్ టేస్ట్ చేసిన యువతి.. ఆ తరువాత మొత్తం లాగించేసింది.

వివరాల్లోకెళితే.. మాడ్రిడ్‌లో ఉదయపూర్ అనే ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఫాతిమా(20) తన స్నేహితులతో కలిసి ఇండియన్ రెస్టారెంట్‌లోకి వచ్చింది. అయితే, ఈ రెస్టారెంట్‌లో ఫాతిమా తొలిసారి ఇండియన్ ఫుడ్ బటర్ నాన్, చికెన్ టిక్కా మాసాలా టేస్ట్ చేసింది. స్ఫూన్‌తో కొంచెం టేస్ట్ చేసిన ఆమె.. ఆ టేస్ట్‌కు ఫిదా అయిపోయింది. వావ్ అంటూ ఆశ్చర్యపోయింది. న్యూ ఫ్లేవర్, స్పైసీ ఫుడ్ టేస్ట్ చేసే సరికి ఫాతిమా మైండ్ ఔట్ అయిపోయిందట. ‘‘నిజంగా టేస్ట్ అదిరిపోయింది. ఓ మై గాడ్.. ఇంత టేస్టీ ఫుడ్‌ని ఇంతకాలం ఎలా మిస్ అయ్యాను. టేస్ట్ అమేజింగ్‌గా ఉంది. నా మొత్తం జీవితంలో నేను తిన్న బెస్ట్ ఫుడ్ ఇదే.’’ అంటూ తెగ సంబరపడిపోయింది ఫాతిమా. ముందుగా బటర్ నాన్, చికెన్ సూప్‌ తిని ఫిదా అయిపోయిన ఫాతిమా.. ఆ తరువాత చికెన్ పీస్ తిని షాక్ అయ్యింది. టేస్ట్ అమేజింగ్‌గా ఉందంటూ సంబరపడిపోయింది. నా 20 సంవత్సరాల జీవితంలో నేను ఇలాంటి ఫుడ్‌ను తినలేకపోయానంటే నమ్మలేకపోతున్నాను అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వీడియోను ఫాతిమా తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 90 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

Viral Video:

Also read:

Viral Video: గుడ్ల కోసం గూట్లోకి దూరిన పాము.. పట్టపగలే చుక్కలు చూపించిన పిట్టలు.. షాకింగ్ వీడియో..

MBBS 2021-2022: విద్యా సంవత్సరం కుదింపు.. సెలవుల్లో కోత.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం

Andhra Pradesh: టంగుటూరు డబుల్‌ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లీకూతుళ్లను ఎందుకు చంపారంటే..