Telangana: మందుబాబులకు కీలక అలెర్ట్.. ఇక అలా చేస్తే జైలుకే

మందుబాబులకు బిగ్‌ అలర్ట్‌. అయితే బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్నారా. అయితే ఇకపై మీరు జైలుకు వెళ్లాల్సిందే. డ్యూటీ మగించుకుని ఇంటికి వెళ్తూనో.. స్నేహితులతో సరదాగా రోడ్డు పక్కన మందు తాగుదామని అనుకుంటున్నారా.. అయితే మీకే ఈ అలెర్ట్....

Telangana: మందుబాబులకు కీలక అలెర్ట్.. ఇక అలా చేస్తే జైలుకే
Drinking Of Alcohol
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 15, 2024 | 6:05 PM

మందుబాబులూ మీ కోసమే ఈ న్యూస్. తెలంగాణ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. ఇకపై నిర్మానుష్య ప్రదేశాల్లో, బహిరంగ ప్రాంతాల్లో మందు తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీస్ శాఖ వార్నింగ్ ఇచ్చింది. కొంతమంది ఎక్కడైనా మరుగు ప్రాంతం కనిపెడతే చాలు.. అక్కడికి వెళ్లి.. ఒక క్వార్టర్ గటగట తాగేస్తారు. అతనికి ఇంకొకడు తోడైతే ఇక ఆ పంచాయతీ ఆగేది కాదు. దానికి తోడు లా అండ్ ఆర్డర్ సమస్య. తాగినవాళ్లు ఊరికే ఉంటారు. ఆ మత్తులో ఏదో ఒక తింగరి పని చేసి.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. అందుకే ఇకపై అలా చేస్తే.. 6 నెలలు జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిందే అంటున్నారు పోలీసులు.

అసలు మద్యపానమే ఆరోగ్యానికి హానికరమైనది. మరీ ఆగలేని ప్రాణం అయితే లిక్కర్ ఇంటికి తీసుకువెళ్లి తాగాలని.. లేదా బార్‌లో కూర్చుని మాత్రమే మద్యం సేవించాలని పోలీసు శాఖ సూచించింది. అలా కాదని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ చిక్కితే మాత్రం 6 నెలలు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ పోలీసు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

“బహిరంగ లిక్కర్ సేవించడం చట్టరీత్యా నేరం. ఇలాంటి పనుల వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశించేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై రోడ్లపై, ఖాళీ ప్రవేశాల్లో కానీ మద్యం సేవించిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఈ నేరానికి 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది”.. అంటూ తెలంగాణ పోలీస్ శాఖ ట్వీట్‌ చేసింది. ఎవరైనా బహిరంగ ప్రాంతాల్లో తాగుతూ కనిపిస్తే… డయల్‌ 100కు సమాచారమివ్వాలని ప్రజలకు సూచించింది. సో.. మందుబాబులూ ఇకపై బుద్దిగా మందు తాగండి. తిక్క వేషాలు వేస్తే తప్పదు శిక్ష.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..