AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Premsagar Rao: ఉదయం షోకాజ్.. రాత్రి బిందాస్.. కాంగ్రెస్ రూటే సపరేటు.. షాక్‌లో ఉన్న ప్రత్యర్థి వర్గం!

కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు కు పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా వివరణ ఇవ్వాలంటూ.. క్రమశిక్షణ కమిటీ పేర్కొంది.

Premsagar Rao: ఉదయం షోకాజ్.. రాత్రి బిందాస్.. కాంగ్రెస్ రూటే సపరేటు.. షాక్‌లో ఉన్న ప్రత్యర్థి వర్గం!
Premsagar Rao
Balaraju Goud
|

Updated on: Jan 30, 2022 | 2:03 PM

Share

Show Cause Notice to Ex MLC Premsagar Rao: కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్(Premsagar Rao) రావు కు పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు(Show Cause Notice) జారీ చేసింది. వీలైనంత త్వరగా వివరణ ఇవ్వాలంటూ.. క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. అయితే ప్రేమ్ సాగర్ రావుకు నోటీసులు ఇచ్చే విషయంలో చివరి నిమిషం వరకు తర్జనభర్జనే సాగింది. వీహెచ్ వత్తిడి పెరగడంతో నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రేమ్ సాగర్ రావుకు షోకాజ్ నోటీసులు ఇవ్వకుంటే గాంధీ భవన్‌లో మౌన దీక్ష చేస్తానని వీ.హనుమంతరావు (VH) వార్నింగ్‌ ఇచ్చారు. అంతేకాకుండా గతంలో జరిగిన పీఏసీ మీటింగ్ ఇంఛార్జ్ ఠాకూర్‌తో పాటు పార్టీ సీనియర్స్‌కి దీనిపై ఫిర్యాదు చేశాడు వీహెచ్.

పార్టీలో సీనియర్ నేత కావడం, నేతలందరిపై ఓత్తిడి తీసుకురావడంతో పాటు మౌన దీక్ష చేస్తానని ప్రకటించడంతో చివరి నిమిషం వరకు నోటీసులు ఇచ్చే విషయంలో వేచి చూసిన క్రమశిక్షణ కమిటీ.. మౌన దీక్ష ప్రకటన ఒత్తడి పెంచింది. తప్పని పరిస్థితుల్లో ప్రేమ్‌సాగర్‌రావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో వీహెచ్ పత్తం నెగ్గించుకున్నాడనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇక మరో వైపు ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్ జిల్లా లో బలమైన నాయకుడు. .దీంతో పాటు 4, 5 నియోజకవర్గాల్లో ప్రేమ్ సాగర్ రావు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంతేకాకుండా పార్టీ సభ్యత్వం విషయంలో లక్ష కు పైగా సభ్యత్వాలు పూర్తి చేసి తన బలమేంటో ప్రేమ్ సాగర్ రావు చూపించారు. అయితే ప్రేమ్ సాగర్ రావుకు ఇచ్చిన నోటీసులు సీరియస్ గానే ఇచ్చారా?లేక వీహెచ్ ఒత్తిడితో తూ తూ మంత్రంగా ఇచ్చారా? అనే సందేహం పార్టీ నేతల్లో ఉంది.

ఇదిలావుంటే, వీహెచ్ ఒత్తిడితో మాజీ ఎమ్మెల్సీ కి కాంగ్రెస్ అదిష్టానం జారీ చేసిన ఆ నోటీసులు తూతూ మంత్రమేనా..? మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ విషయంలో అదిష్టానం పూర్తి నమ్మకంతో ఉందా.? మళ్లీ ఆయనకే ఉమ్మడి ఆదిలాబాద్ బాధ్యతలు కట్టబెడకతారా..? అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి‌. రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే బలం బలగం ఉన్న నాయకుడు పార్టీకి తప్పనిసరని భావిస్తోందంట కాంగ్రెస్ అదిష్టానం. అందులో భాగంగానే టీపీసీసీ ఛీప్ రేవంత్ రాక అంటున్నాయి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు. ఓ వైపు షోకాజ్ నోటీసుల జారీచేసినా మరో వైపు పార్టీ అద్యక్షుడి రాకతో అంత చక్కబడినట్టే అని.. ఆ నోటీసులు ఆ పెద్దాయనను సంతృప్తి పరిచేందుకే అన్న టాక్ సాగుతోంది. ఇంతకీ కాంగ్రెస్ ఎత్తుగడ ఏంటి. మాజీ ఎమ్మెల్సీకి మళ్లీ పూర్వవైభవాన్ని కట్టబెడుతారా..? లేక నోటీసుల జారీతో అలక బూనకుండా బుజ్జగించే పర్వం లోనే పీసీసీ ఛీప్ రాకనా..? ఇంతకీ మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ విషయంలో ఏం జరగనుంది.

కాంగ్రెస్ అంటే అంతర్గత పోరుకు పెట్టింది పేరు. ఎప్పుడు ఏ నేత ఎవరిపై కస్సుమంటాడో తెలియని పరిస్థితి. తాజాగా మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావుకు షోకాజ్ నోటీసులు జారీ చేయించడంలో తన బలం నిరూపించుకున్నాని సంబరపడిపోయిన ఆనందం ఆ సీనియర్ నేత వీహెచ్ కు ఒక్కరోజు కూడా దక్క‌నివ్వలేదంటా కాంగ్రెస్ అదిష్టానం. నోటీసుల జారీతో అగ్గిమీద గుగ్గిలమైన ఆ మాజీ ఎమ్మెల్సీని బుజ్జగించేందుకు ఏకంగా రాష్ట్ర అద్యక్షుడే రంగంలోకి‌ దిగక తప్పలేదు.

ప్రేంసాగర్ లాంటి బలమైన నేత పార్టీకి తప్పక కావాలని ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పదికి పది స్థానాలు గెలుస్తుందని.. ఈ గెలుపులో ప్రేంసాగర్ సేవలు పార్టీకి తప్పకుండా ఉండాలని జిల్లా నేతలు అంటున్నారు.. ఇది విషయాన్ని రేవంత్‌ తెలుపడంతో ఆ షోకాజ్ నోటీసుల వ్యవహారం అంతా తూతూ మంత్రమే అని తేలిపోయిందన్న టాక్ తెరపైకి వచ్చింది. ఇంద్రవెళ్లి ఆత్మగౌరవ దండోరా సభతో ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కు పునరజన్మ దక్కిందని.. ఆ సభ సక్సెస్ చేసిన ప్రేంసాగర్ కు పార్టీలో ఉన్నత స్థానం దక్కుతుందని రేవంత్ రెడ్డి తెలుపడంతో ప్రేంసాగర్ వర్గంలో ఎక్కడలేని జోష్ కనిపించింది. ఉదయం అంతా షోకాజ్ నోటీసుల టెన్షన్ తో ఆందోళనలో కనిపించిన ప్రేంసాగర్ వర్గం నేతలు రాత్రి రేవంత్ రాకతో సంబరాల్లో మునిగిపోగా.. ప్రత్యర్థి వర్గం మాత్రం ఇందేంటి ఇలా తేడా కొట్టిందని షాక్ అవుతున్నారంటా. మొత్తానికి షోకాజ్ నోటీసుల వ్యవహారం టీపీసీసీ రాకతో మలుపు తిరిగింది. మరీ ప్రేంసాగర్ వ్యవహరంపై సీనియర్ నేత వీహెచ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

నరేష్ స్వేన, టీవి9 ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.