AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పల్లెపోరులో భార్య ఓటమి.. భర్త చేసిన పనికి నోరెళ్లబెట్టిన గ్రామస్తులు.. ఏం చేశాడంటే

తెలుగు రాష్ట్రాల్లో పంచాయతి పోరు కొనసాగుతుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగియగా తాజాగా మూడో విడత బుధవారం జరగనుంది. అయితే రెండు విడతల్లో ఊహించని వెలువడి ఊహించని ఫలితాలు అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లాయి. దీంతో మనస్తాపానికి గురైన కొందు ఆత్మహత్యకు యత్నించారు. ఇక ఖమ్మం జిల్లాలోనూ ఓ అభ్యర్థి ఇదే పని చేశాడు. ఎన్ని భార్య ఓటమి తట్టుకోలేక.. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.

Telangana: పల్లెపోరులో భార్య ఓటమి.. భర్త చేసిన పనికి నోరెళ్లబెట్టిన గ్రామస్తులు.. ఏం చేశాడంటే
Telangana Panchayat Elections 2025
N Narayana Rao
| Edited By: |

Updated on: Dec 16, 2025 | 4:35 PM

Share

ఊరి సర్పంచ్ కావాలన్నది ఆయన కోరిక.. ఎంతో ఆశతో తన భార్య చేత పోటీ చేయించాడు. చివరకు తన ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. ఊరి కోసం ఏ పని ఉన్నా చేశాను. ఆపద వస్తె ముందు ఉన్నాను. అభివృద్ధి ఎంతో ఖర్చు చేశాను. కానీ చివరకు సర్పంచ్ ఎన్నికల్లో ఓడించారుంటూ ఆవేదను గురైన ఓ సర్పంచ్ అభ్యర్థి భర్త పురుగులు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన్ను పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం హర్యా తండాకు చెందిన మాలోత్ రంగా అనే వ్యక్తి తన భార్యను ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించారు. ఎన్నికల గెలుపు కోసం డబ్బులు ఖర్చు చేశారు, జోరుగా ప్రచారం కూడా చేశారు. కానీ చివరకు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ స్వాతి గెలుపొందారు. దీంతో సహనం కోల్పోయిన రంగా.. తాను గ్రామంలో ఎంతో సేవ చేశానని, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టానని.. అయినా తాను ఓడిపోవడం ఏంటని ప్రశ్నించాడు. ఎన్నికల్లో రిగ్గింగ్, అక్రమాలు చేసి తనను ఓడించారని ఆరోపించాడు.

తనకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 12న గ్రామంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. దాదాపు ఆరు గంటల పాటు టవర్ పైనే ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఫైర్ ఇంజిన్‌తో అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా అతను దిగేందుకు ఒప్పులోకేదు. చివరకు ఎమ్మార్వో హామీతో ఆందోళన విరమించి సెల్ టవర్ దిగాడు. దీనితో అందరి ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఈ ఘటన జరిగి నాలుగు రోజులు కూడా గడవక ముందే తనకు న్యాయం చేయలేదని పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు అన్ని వెంటనే హాస్పిటల్‌లకు తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యలు చికిత్స అందించారు. ప్రస్తతుం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.