Hyderabad: టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ తండ్రి, ఉద్యోగ సంఘాల నేత సాంబశివరావు కన్నుమూత
P&T, BSNL ఉద్యోగ సంఘాల నేత, టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ తండ్రి సాంబశివరావు కన్నుమూశారు. CITU, సీపీఎంలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన మృతికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ..

P&T, BSNL ఉద్యోగ సంఘాల నేత, టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ తండ్రి సాంబశివరావు(81) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన CITU, సీపీఎంలో సుదీర్ఘకాలం పని చేశారు. సాంబశివరావు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ – డీవోటీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా సాంబశివరావు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. సాంబశివరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఇంటి పెద్దను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని సీఎం తెలియజేశారు.
View this post on Instagram
అటు డిప్యూటీ సీఎం భట్టి సైతం వెల్లలచెరువు సాంబశివరావు మరణం పట్ల సంతాపం ప్రకటించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి, ఉత్తమ్, జూపల్లి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ, జగ్గారెడ్డి, బీజేపీ నేత ఈటల, రాంచందర్‌రావు, షర్మిల, డీకే అరుణ, మాజీ మంత్రి కేటీఆర్, ఏపీ BJP చీఫ్ మాధవ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. సాంబశివరావు మృతికి సంతాపం తెలిపిన మాజీ మంత్రి హరీష్‌రావు.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. బుధవారం గుంటూరు మహాప్రస్థానంలో సాంబశివరావు అంత్యక్రియలు జరగనున్నాయి.




