AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతోన్న నందా దీపం.. స్వామి సన్నిధిలో దివ్య కాంతులు

ఈ ఆలయానికి.. 700 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామి వారి సన్నిధిలో నిరంతరం దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు నూనె తో వస్తారు. స్వామి వారి దర్శనం తరువాత ఈ దీపంలో నూనె పోస్తారు. దీంతో దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఈ ఆలయం ఎక్కడ ఉందో? ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మండల కేంద్రంలో గల అతి పురాతన ప్రాచీన ఆలయమైన శ్రీ సీతారామాలయం ప్రత్యేకతలు సంతరించుకుంది. ఆలయ నిర్మాణం పూర్తి చేసుకున్న..

Telangana: ఆ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతోన్న నందా దీపం.. స్వామి సన్నిధిలో దివ్య కాంతులు
Nanda Deepam At Sitaramalayam
G Sampath Kumar
| Edited By: Srilakshmi C|

Updated on: Sep 20, 2023 | 11:46 AM

Share

గంభీరావుపేట, సెప్టెంబర్ 20: ఈ ఆలయానికి.. 700 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామి వారి సన్నిధిలో నిరంతరం దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు నూనె తో వస్తారు. స్వామి వారి దర్శనం తరువాత ఈ దీపంలో నూనె పోస్తారు. దీంతో దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఈ ఆలయం ఎక్కడ ఉందో? ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మండల కేంద్రంలో గల అతి పురాతన ప్రాచీన ఆలయమైన శ్రీ సీతారామాలయం ప్రత్యేకతలు సంతరించుకుంది. ఆలయ నిర్మాణం పూర్తి చేసుకున్న సుమారు 700 ఏళ్ల నుండి నిరంతరంగా వెలుగుతున్న జ్యోతి. ప్రతి ఏటా నవహ్నిక బ్రహ్మోత్సవాలు. శ్రీరామనవమి రోజున స్వామి వారి కల్యాణం మొదలుకుని 9 రోజుల పాటు ఉత్సవాలువాలు కన్నుల పండుgగా నిర్వహిస్తారు. గ్రామస్తుల భాగస్వామ్యం, భక్తి శ్రద్దలతో నవహ్నిక బ్రహోత్సవాలు ఘనంగా జరుగుతాయి.18 స్థంభాల చతురస్రాకార మంటపంలో కల్యాణం నిర్వహిస్తారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారామ కల్యాణం కన్నుల పండువగా జరిపిస్తారు. గర్భగుడి ముందు గల 16 రాతి స్తంభాలతో నిర్మించిన మంటపంలో సీతారామ కల్యాణం భద్రాచలంలో జరిగిన విధంగా ఘనంగా జరుపుతారు. కల్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు సాంప్రదాయంగా దాతల సహకారంతో అన్నదానం చేస్తారు.

నిరంతరంగా వెలుగుతున్న నందాదీపం

శ్రీ సీతారామాలయం 1333 వ సంవత్సరంలో నిర్మాణం చేసినట్లు ప్రధాన ఆలయంలో గంటపై ఆధారాలు ఉన్నాయి. నందాదీపం గత 700 సంవత్సరాల పైగా నిరంతరం వెలుగుతూనే ఉంది. ఆకాలంలో నిర్మించబడిన ఈ ఆలయంలో మూల విగ్రహాల ప్రతిష్టకు ముందు ‘నందా దీపం’ను ప్రతిష్టించారు. ఈ దీపం ప్రతిష్ట అనంతరం మూల విగ్రహాల ప్రతిష్ట ధ్వజస్థంభ ప్రతిష్టలు జరిగినట్లు తెలుస్తుంది. అనాటి నుండి నేటి వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంది. నిజాం కాలంలో సైతం ఈ ఆలయం దూప దీప నైవేద్యాలు అందుకుందని పూర్వీకులు తెలుపుతున్నారు. ఈ నందా దీపం వెలుగుతుండటం వల్ల గ్రామ ప్రజలకు ఐస్ట ఐశ్వర్యం, ధాన్యం, సంవృద్ధిగా కలుగుతుందని గ్రామ ప్రజలకు ప్రగాఢ విశ్వాసం ఉంది.

ఇవి కూడా చదవండి

19 రోజుల పాటు ఉత్సవాలు

శ్రీ శ్రీరామనవమి రోజున స్వామి వారి కల్యాణం నుండి 9 రోజుల పాటు బ్రహోత్సవాలు కన్నుల పండవగా నిర్వహిస్తారు. పంచ లోహలతో చెక్కబడిన ఉత్సవమూర్తులు బ్రహ్మోత్సవాలలో వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో అశ్వ, గజ, గరుడ, పురాణం హన్మాన్, శేష, పోన్న సేవ వాహనాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. గరుడ సేవా, రథోత్సవం అనంతరము ఏకాంత సేవ కార్యక్రమంతో సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు.

శ్రీరామ నవమి నుండి 9 రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాము. ఇతర రాష్ట్రాల, మండలాల నుండి భక్తులు ఆధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలలో పాల్గొంటారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతన్న మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తారు. సుమారు 700 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో నిర్మాణం చేసిన సీతారామాలయంలో అందరి సహకారంతో గత రెండేళ్ల క్రితం పునర్ నిర్మాణ పనులు ప్రారంభించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.