Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్‌.. వరంగల్‌ జిల్లాకు చెందిన..

ఓటరు నమోదు, సవరణ, మార్పులు చేర్పులు, ఓటు వినియోగం ప్రయోజనాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ట్రాన్స్‌జెండర్‌ను ప్రచారకర్తగా వినియోగిస్తారు. ఓటు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పలు ఐకాన్‌లను ఎంపిక చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. వరంగల్‌కు చెందిన

తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్‌.. వరంగల్‌ జిల్లాకు చెందిన..
Transgender Laila F
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 20, 2023 | 12:55 PM

తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఓ వైపు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవటం కోసం అన్నీ ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతూ విశ్వ ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయి. మరోవైపు ఎన్నికల అధికారులు సైతం ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణపై కసర్తుత మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఎన్నికల కమిషన్‌ ఈసారి సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషన్‌ తరఫున ప్రచారానికి ఒక ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రచారకర్తగా తొలిసారి ట్రాన్స్‌జెండర్‌ లైలాను ఎంపిక చేసింది.

ఓటరు నమోదు, సవరణ, మార్పులు చేర్పులు, ఓటు వినియోగం ప్రయోజనాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ట్రాన్స్‌జెండర్‌ను ప్రచారకర్తగా వినియోగిస్తారు. ఓటు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పలు ఐకాన్‌లను ఎంపిక చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. వరంగల్‌కు చెందిన ఓరుగంటి లైలాను ఎన్నికల సంఘం రాష్ట్ర ఐకాన్‌లలో ఒకరిగా ఎంపిక చేసినట్టుగా ప్రకటించారు. లైలా ఓటర్ల నమోదును నిర్ధారించడంలో ప్రజలతో మమేకమవుతారని చెప్పారు. ట్రాన్స్‌జెండర్ల పేర్లను ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి, వారిలో ఓటుపై అవగాహన కల్పించడానికి కృషి చేస్తుందన్నారు. ఆమె జిల్లా ఎన్నికల అధికారులతో కలిసి పనిచేయడం ప్రారంభించిందని CEO తెలిపారు.

అయితే, సాధారణంగా ఈ ప్రచారం కోసం ఎన్నికల కమిషన్‌ సమాజంలో పేరున్న ప్రముఖులను, నటీనటులను, సెలబ్రిటీలను, సామాజికవేత్తలను ప్రచారకర్తలుగా ఎంపిక చేస్తుంది. ఇప్పుడు తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌ను ఎన్నికల ప్రచారకర్తగా ఎంపిక చేయడం విశేషం. లైలా వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీలో సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడేందుకు ఒక ఎన్జీవోను ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న ట్రాన్స్‌జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. వారి సంక్షేమం కోసం జిల్లా అధికారులతో మాట్లాడి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో వారంలో ఒక రోజు వారికి ప్రత్యేక క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేయించారు.

ఇవి కూడా చదవండి

ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడిన అనుభవం తనకు ఉందని, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తనకు ఆసక్తి ఉందని లైలా తెలిపింది. రాష్ట్రంలోని చాలా మంది ట్రాన్స్‌జెండర్లను కలుసుకుని తమ పేర్లను ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించామని, ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లను పౌరులుగా గుర్తించి ఓటు వేసే అవకాశం కల్పించిందని, తెలంగాణలో ఎక్కువ మంది ట్రాన్స్‌జెండర్లను ఓటర్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని లైలా అన్నారు. ఎన్నికల సంఘం ఐకాన్‌గా ఎంపిక కావడం తన జీవితంలో అత్యుత్తమ ఘట్టగా లైలా చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించడంలో అధికారులు తన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారని లైలా వివరించారు. జోడించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..