AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పాపం ఆడవాళ్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావ్..! లోకల్‌ ట్రైన్‌లో సీటు కోసం రన్నింగ్‌ రేసులు..

అలా కిందపడుతూ, లేస్తూ.. తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటూ ట్రైన్‌ ఎక్కుతున్న దృశ్యం వారి బిజీ బిజీ లైఫ్‌ షెడ్యూల్‌ని చూపిస్తుంది. వైరల్ అయిన అది.. వీడియో మహిళా కోచ్‌లా ఉంది. ప్రయాణికులు ట్రైన్‌ ఎక్కగానే సీటు కోసం మహిళలు అటు ఇటు పరుగులు తీస్తున్నారు. ఆ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే.. మహిళలు ఎక్కడం ప్రారంభించినా స్టేషన్‌లో రైలు ప్లాట్‌ఫామ్‌పై ఆగలేదని అర్థమవుతుంది. ఇది నిజంగా ప్రమాదకరంగా అనిపిస్తుంది.

Watch Video: పాపం ఆడవాళ్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావ్..! లోకల్‌ ట్రైన్‌లో సీటు కోసం రన్నింగ్‌ రేసులు..
Mumbai Local Train
Jyothi Gadda
|

Updated on: Sep 20, 2023 | 3:36 PM

Share

రిజర్వేషన్‌ లేకుండా బస్సులు, రైళ్లలో ప్రయాణించాలంటే.. అదో పెద్ద సాహసం వంటిదే.. అలా ఏదైనా టూర్‌కి వెళ్లినప్పుడ ఏదో ఒక విధంగా సీటు సంపాదించడమే లక్ష్యం పరిగెట్టాల్సి ఉంటుంది. దీని కోసం చాలా మంది ప్రయాణంలో తోటి వారితో కుస్తీలు పట్టాల్సి వస్తుంది. అలా చేస్తే గానీ, సీటు దొరకదు. ఇకపోతే, సాధారణంగానే ఆర్టీసీ బస్సులు, ప్యాసింజర్‌ ట్రైన్లలో సీట్ల విషయంలో ప్రయాణికుల మద్య జరిగే గొడవలు తరచూ వైరల్‌ అవుతుంటాయి. సీట్ల కోసం మహిళలు సిగపట్లు కూడా పడుతుంటారు. గతంలో ఢిల్లీ మెట్రోలో కూడా ఇలాంటి ఘటనలు జరగటం, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌ కావటం చూశాం. అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఈ సారి మహిళలు లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఏం జరిగిందో చూపించే వీడియో ఇది. ఈ రైలు ఎంత రద్దీగా ఉంది అంటే మరో వ్యక్తి ఎక్కితే అడుగు పెట్టడానికి కూడా స్థలం లేదు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది ముంబై స్థానికుల జీవన ప్రయాణంగా పలువురు నెటిజన్లు చెబుతున్నారు.

ఇక ముంబై లోకల్‌లో ప్రయాణం చేయడం అంటే మీ ప్రాణాలను పణంగా పెట్టడమే. ట్రైన్‌లో అడుగు పెట్టడానికి కూడా స్థలం లేనంత రద్దీగా ఉంటుంది. ఇదేదో ఒకటి రెండు రోజులు ఇలా ఉంటుంది అనుకుంటే పొరపాటే.. ప్రతి రోజు ప్రతి రైలు ఇలాగే కిక్కిరిసి పోయి ఉంటుంది. చాలా సందర్భాల్లో ప్రయాణికులు రైలు డోర్‌ వద్దే వేలాడుతూ ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రైలు ప్లాట్‌ఫామ్‌ పైకి వచ్చి రాగానే.. ప్రయాణికులంతా ఎగబడుతున్నారు.. ఖాళీగా ఉన్న ట్రైన్‌లో కి కూడా వారంతా వేగంగా దూసుకెళ్తూ ఎక్కుతున్నారు. ట్రైన్ ఎక్కే క్రమంలో పక్కవాళ్లు కిందపడిపోయినా సరే.. తమకు మాత్రం ట్రైన్‌లో సీటు దొరకాలనే లక్ష్యంతోనే వారంతా పరుగులు పెట్టడం వీడియోలో కనిపించింది. అలా కిందపడుతూ, లేస్తూ.. తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటూ ట్రైన్‌ ఎక్కుతున్న దృశ్యం వారి బిజీ బిజీ లైఫ్‌ షెడ్యూల్‌ని చూపిస్తుంది.

వైరల్ అయిన అది.. వీడియో మహిళా కోచ్‌లా ఉంది. ప్రయాణికులు ట్రైన్‌ ఎక్కగానే సీటు కోసం మహిళలు అటు ఇటు పరుగులు తీస్తున్నారు. ఆ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే.. మహిళలు ఎక్కడం ప్రారంభించినా స్టేషన్‌లో రైలు ప్లాట్‌ఫామ్‌పై ఆగలేదని అర్థమవుతుంది. ఇది నిజంగా ప్రమాదకరంగా అనిపిస్తుంది.

@theskindoctor13 అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో వీడియో షేర్ చేయబడింది. ఇప్పటికే ఈ వీడియోను తొమ్మిది లక్షల మందికి పైగా ప్రజలు దీనిని చూశారు. వీడియోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..