Andhra Pradesh: పుష్ప స్టైల్ లో గంజాయి స్మగ్లింగ్.. పోలీస్ చేజింగ్..! హై స్పీడ్ గా వెళ్తున్న వాహనం నుంచే…
చిత్రకొండ పోలీసులు వ్యాన్‌ను స్వాదినం చేసుకున్న క్రమంలో అక్కడే మరో లారీ కూడా కనిపించింది. రెండు వాహనాలతో 900 కిలోలకు పైగా గంజాయి సీజ్ చేశారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని ఏపీలోకి తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ గంజాయి రవాణాలో పాత్రదారులపై విచారణ జరుపుతున్నారు చిత్రకొండ పోలీసులు.
విశాఖపట్నం, సెప్టెంబర్19: ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. పోలీసులు కళ్లు గప్పి తప్పించుకోవాలని పుష్ప స్టైల్ లో ప్లాన్ చేశారు. పారిపోతూ నడుస్తున్న వాహనం నుంచే పోలీసు వాహనానికి అడ్డంగా.. గంజాయి బస్తాలను రోడ్డుపై పడేశారు. హై స్పీడ్ లో పారిపోతున్న స్మగ్లర్లకు పోలీసులు చుక్కలు చూపించారు. అయితే చివరికి గంజాయిని వదిలి స్మగ్లర్లు పరారయ్యారు. సినిమా ఫక్కీలో సాగిన ఈ చేజింగ్ లో రెండు వాహనాలతో గంజాయిని సీజ్ చేశారు పోలీసులు.
గంజాయితో పారిపోతూ..
– ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో చిత్రకొండ బ్లాక్ పడ్ ఫాదర్ పంచాయితీ రేకపల్లి గ్రామంలో స్మగ్లర్లు గంజాయి కొనుగోలు చేసి బొలెరో వాహనంలో లోడ్ చేశారు. ఏపీ 07 టి కే 0466 రిజిస్టర్ నెంబర్ గల వాహనంలో తరలించడానికి సిద్ధం చేశారు. ఈలోగా చిత్రకొండ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహింస్తుండగా ఒక బొలోరో పికప్ వాహనం వేగంగా రావడం ప్రారంబించింది. ఈ వాహనంను ఆపడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూసి వాహనాన్ని ఆపకుండా స్పీడ్ గా ముందుకు వెళ్లిపోయారు. చిత్రకొండ పోలీసులు పోలీసులు ఆవాహనంను వెంబడించారు. స్మగ్లర్లు వాహనంను ఆపకుండా వాహనంలో గంజాయి బ్యాగులను రహదారిపై పడేశారు. వాటిని తప్పించుకుంటూ హై స్పీడ్ లో పోలీసులు ముందుకు సాగారు. ముందు వాహనంలో స్మగ్లర్లు.. వెనుక పోలీసులు. అయితే చాలా సేపు వాహనం ను వెంబడించి పోలీసులు వాహనాన్ని దారాలమ్మ ఘాట్ రోడ్లో పట్టుకోగలిగారు. అయితే స్మగ్లర్లు మాత్రం పోలీసులను తప్పించుకుని పారిపోయారు. ఈ గంజాయి వాహనం చేజింగ్ ను వీడియో చిత్రీకరించారు.
– చిత్రకొండ పోలీసులు వ్యాన్‌ను స్వాదినం చేసుకున్న క్రమంలో అక్కడే మరో లారీ కూడా కనిపించింది. రెండు వాహనాలతో 900 కిలోలకు పైగా గంజాయి సీజ్ చేశారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని ఏపీలోకి తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ గంజాయి రవాణాలో పాత్రదారులపై విచారణ జరుపుతున్నారు చిత్రకొండ పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..