Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లో కొలువుదీరిన వినాయకుడు.. 10రోజుల పాటు ప్రయాణిస్తునే పూజలందుకుంటాడు..

రైల్వే ప్రయాణికులకు ఎదురొచ్చే అన్ని అడ్డంకులను తొలగించి, వారి ఇళ్లలో ఆనందం, శాంతిని తీసుకురావాలని గణపతిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. నియోజకవర్గంలో శాంతి, సంతోషాలు కలగాలని కోరుకున్నారు. వర్షాలు కురువాలని.. కరువు పోవాలని.. ఆయన పాదాలపై కూర్చుని ప్రార్థించారు. భారతదేశంలో గణేశుడిని రైలులో ప్రతిష్టించటం ఎక్కడ చూసుండరు.. కానీ ఇక్కడ ప్రత్యేకించి రైలులో వినాయక ప్రతిష్ట జరుగుతుందని స్థానిక మ్మెల్యే అన్నారు.

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లో కొలువుదీరిన వినాయకుడు.. 10రోజుల పాటు ప్రయాణిస్తునే పూజలందుకుంటాడు..
Shivaji Maharaj Terminus
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 19, 2023 | 4:56 PM

దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఊరు వాడ కొలువైన గణనాధులు భక్తుల విశేష పూజలందుకుంటున్నారు. ఒక్కొ పట్టణంలో ఒక్కో విధంగా, విభిన్న రూపాల్లో కొలువైన వినాయక ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, వినాయకుడు విచిత్రం రైల్లో ప్రయాణిస్తున్నాడు. మన్మాడ్, నాసిక్ మధ్య నడుస్తున్న రైలులో విభిన్నంగా గణేశుడిని ప్రతిష్టించారు. ట్రావెల్ అసోసియేషన్, గోదావరి రాజా ట్రస్ట్ ఆధ్వర్యంలో మన్మాడ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ గత 27 సంవత్సరాలుగా గణేషోత్సవాన్ని జరుపుకుంటోంది. విఘ్నాధిపతిని షిండే గ్రూప్ ఎమ్మెల్యే సుహాస్ కాండే స్థాపించారు.

మన్మాడ్ – ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్‌లో ఆటపాటలు, ఉత్సాహంతో ఈ గణేశుడిని ప్రతిష్టించారు. ఇందుకోసం ప్రయాణికుల బోగీల్లో ప్రత్యేక అలంకరణలు చేశారు. అలాగే, ఈ క్యారేజ్‌లో రైల్వే భద్రత గురించి సందేశాలు ఇచ్చే పోస్టర్‌లను కూడా అతికించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ గణపయ్య మరో పదిరోజుల పాటు ఇలా రైలులోనే ప్రయాణం చేస్తాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుహాస్‌ కండేతో పాటు చక్రమణ్య కూడా బ్యాండ్‌ దరువుకు సరదాగా స్టెప్పులేశారు. రాష్ట్రంలో కరువును పారద్రోలాలని సాకాడే ఎమ్మెల్యే కండె గణపయ్యను వేడుకున్నారు. రైల్వే ప్రయాణికులకు ఎదురొచ్చే అన్ని అడ్డంకులను తొలగించి, వారి ఇళ్లలో ఆనందం, శాంతిని తీసుకురావాలని గణపతిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. నియోజకవర్గంలో శాంతి, సంతోషాలు కలగాలని కోరుకున్నారు. వర్షాలు కురువాలని.. కరువు పోవాలని.. ఆయన పాదాలపై కూర్చుని ప్రార్థించారు. భారతదేశంలో గణేశుడిని రైలులో ప్రతిష్టించటం ఎక్కడ చూసుండరు.. కానీ ఇక్కడ ప్రత్యేకించి రైలులో వినాయక ప్రతిష్ట జరుగుతుందని ఎమ్మెల్యే సుహాస్‌ కండే అన్నారు.

నాగ్‌పూర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతిపెద్ద గణేశ మండపంగా పిలువబడే సంతి గణపతిని ఈ యేడు విశేషంగా స్థాపించారు. 66 సంవత్సరాలుగా, శాంతి గణేశ మండపం దేశంలోని వివిధ దేవాలయాలను ప్రతిరూపం చేస్తోంది. ఈ ఏడాది గణనాధుడు మీనాక్షి దేవి విగ్రహానికి సుమారు 15 లక్షల విలువైన ఆభరణాలను భక్తులు సమర్పించారు. మరో 10 రోజుల్లో, నాగ్‌పూర్ నుండి మాత్రమే కాకుండా విదర్భ నుండి గణేశ భక్తులు దర్శనం కోసం ఇక్కడి శాంతి బప్పాకు చేరుకుంటారని ఆలయ నిర్వాహకులు చెప్పారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా, ఎక్కడ విన్న గణనాధులు, జై బోలో గణేశ నినాదాలో మార్మోగింది. ఎటు విన్న గణపతి బప్పా మోర్య మంగళమూర్తి మోర్యా అంటూ ఆలపించారు భక్తులు. ఈ సమయంలో భక్తుల్లో ఎక్కడ లేని ఉత్సహం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..