కమ్మని విందుకు కసూరి మేతి.. కానీ, మహిళల ఆరోగ్యానికి ఈ మెంతి కూర చేసే మేలు తెలుసా..?

కసూరి మేతి బరువు తగ్గడం, మధుమేహం నియంత్రణతో సహా అనేక వ్యాధుల నుండి ఉపశమనం పొందేందుకు పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళలు కసూరి మెంతి తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది బిడ్డ ఎదుగుదలకు మాత్రమే కాకుండా ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కసూరి మేతి తినడం వల్ల స్త్రీలకు కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కమ్మని విందుకు కసూరి మేతి.. కానీ, మహిళల ఆరోగ్యానికి ఈ మెంతి కూర చేసే మేలు తెలుసా..?
Kasuri Methi
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 19, 2023 | 4:31 PM

సాధారణంగా వంటింట్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో కసూరి మేతి ఒకటి. దీని రుచి కాస్త చేదుగా ఉన్నప్పటికీ, ఆహార రుచిని పెంచడంలో కసూరి మేతి అద్భుతం చేస్తుంది. మనం నిత్యం ఉపయోగించే మసాలా దినుసులలో ఒకటైన కసూరి మేతి రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. కసూరి మేతి బరువు తగ్గడం, మధుమేహం నియంత్రణతో సహా అనేక వ్యాధుల నుండి ఉపశమనం పొందేందుకు పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళలు కసూరి మెంతి తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. కసూరి మేతి తినడం వల్ల స్త్రీలకు కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కసూరి మేతి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

PCOSని తగ్గిస్తుంది కసూరి మేతి:

కసూరి మేతిలో కాల్షియం, మెగ్నీషియంతో సహా విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది PCOS (ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్) లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. PCOS సమస్య ఉన్నవారు రోజువారీ జీవితంలో కసూరి మేతిని ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: ఈ రోజుల్లో బరువు తగ్గడం ఒక సవాలుతో కూడుకున్న పని. ఎంత వ్యాయామం చేసినా, ఎంత డైట్ చేసినా బరువు తగ్గడం అంత తేలిక కాదు. మహిళలు బరువు తగ్గడానికి చాలా కష్టపడతారు. మీరు మీ ఊబకాయాన్ని తగ్గించుకోవాలనుకుంటే, కసూరి మేతి ఉపయోగించండి. కసూరి మేతిలో మంచి పీచు ఉంటుంది. ఇది మీ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలి తగ్గడం వల్ల ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. దీంతో బరువును అదుపులో ఉంచుకోవచ్చు. కసూరి మెతి జీర్ణక్రియను ప్రేరేపించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కసూరి మేతి శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది.

గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తుంది : కసూరి మేతిలో మంచి మొత్తంలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. గర్భిణీ స్త్రీలు దీనిని తీసుకోవడం వలన గర్భధారణ సమయంలో శిశువు నిర్మాణం సరిగ్గా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ కడుపులో అభివృద్ధి చెందుతున్న పిండానికి అవసరం. ఇది కసూరి మేతిలో ఎక్కువగా ఉంటుంది. ఇది బిడ్డ ఎదుగుదలకు మాత్రమే కాకుండా ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

హార్మోన్ల సమతుల్యత: మహిళలు హార్మోన్ల సమస్యలతో బాధపడుతుంటారు. వారికి ప్రతి దశలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఉంటాయి. హార్మోన్ సమతుల్యత కోసం కసూరి మేతి తినాలి. కసూరి మేతిలో విటమిన్ 1 మంచి మొత్తంలో ఉంటుంది. రుతుక్రమం సమస్యను తగ్గించుకోవడానికి మహిళలు కసూరి మేతిని ఉపయోగించాలి.

పాలిచ్చే తల్లులకు మేలు: కసూరి మేతిని పాలిచ్చే తల్లులు తినాలి. ఇది తల్లి పాల పరిమాణాన్ని పెంచడమే కాకుండా తల్లి పాల నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి