అక్క తెలివికి హాట్సాఫ్..! ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన మహిళ.. టైమ్ వెస్ట్ చెయలేదు..! ఏం చేసిందో తెలిస్తే ..
వైరల్ ఫోటోలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. ముందు ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంది. కారు ఇప్పట్లో ముందుకు కదిలేలా కనిపించటం లేదు. ఇలాంటి సమయంలో దాదాపుగా ఎవరైనా చిరాకు పడిపోతారు. విసుగుతో చిర్రెత్తిపోతారు. అయితే, ఈ మహిళ ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. ముందున్న ట్రాఫిక్‌తో నిరుత్సాహపడకుండా ఆ మహిళ ట్రాఫిక్ సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంది.
పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య అతి భయంకరంగా మారింది. ఇక బెంగళూరు ఐటీ నగరంలో ట్రాఫిక్ జామ్‌ల గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడి ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే.. కిలో మీటరు దూరం ఉన్న రోడ్డు ప్రయాణానికి కూడా గంటల సమయం పడుతుంది. ఇది ప్రయాణికులు, వాహనదారులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఒక్కోసారి వారి ఓపికను నశింపజేస్తుంది. అయితే, ట్రాఫిక్ జామ్‌ల సమయాన్ని కూడా మరోలా ఉపయోగించుకునే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారు ఎంతటి ట్రాఫిక్‌లో కూడా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, కారులో కూర్చొని హాయిగా తమ పనులను పూర్తి చేసుకుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ ఫోటోలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. ముందు ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంది. కారు ఇప్పట్లో ముందుకు కదిలేలా కనిపించటం లేదు. ఇలాంటి సమయంలో దాదాపుగా ఎవరైనా చిరాకు పడిపోతారు. విసుగుతో చిర్రెత్తిపోతారు. అయితే, ఈ మహిళ ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. ముందున్న ట్రాఫిక్‌తో నిరుత్సాహపడకుండా ఆ మహిళ ట్రాఫిక్ సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంది. మార్కెట్ నుంచి కొని తెచ్చుకున్న కూరగాయలు ఒలుస్తూ ట్రాఫిక్ టైమ్‌ని వాడేసుకుంది. కారు డ్రైవింగ్ సీటులో కూర్చుని ఉన్న ఆమె.. మరో సీటుపై పచ్చి బఠానీలను ఒలిచి పెట్టుకుంది. ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు బఠానీలు మొత్తం ఒలిచేసుకోవచ్చునని భావించింది.
Being productive during peak traffic hours 😑 pic.twitter.com/HxNJoveHwS
— Priya (@malllige) September 16, 2023
అయితే, ఇదంతా తోటి వాహనదారులు ఎవరో ఫోటో తీశారు..అదే ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. డ్రైవింగ్ సీటు పక్కనే ఉన్న సీటుపై మూడు బ్యాగులు కనిపిస్తున్నాయి. ఒక కవర్‌లో తొక్కలు, మరో కవర్‌లో ఒలిచిన బఠానీలు ఉన్నాయి. మూడో కవర్‌లో మొత్తం బఠానీలు ఉంటాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడల్లా ఈమె ఇలాంటి పనులు చేస్తూ సమయాన్ని సరిగ్గా ఆదా చేసుకుంటుంది. దీంతో ఇంటికి వెళ్లాక చేయాల్సిన ఆమె పని పూర్తయింది. ట్రాఫిక్ ఒత్తిడి లేదు. ట్రాఫిక్ కారణంగా ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే ప్రతి ఒక్కరూ ఈ మహిళ నుండి నేర్చుకోవాలంటూ పలువురు నెటిజన్లు స్పందించారు.
ఈ వైరల్ పోస్ట్ చూసిన చాలా మంది వినియోగదారులు తమ స్పందనలను పంచుకున్నారు. ఒకరు స్పందిస్తూ.. మీరు టైమ్‌ని వాడుకున్న స్టైల్ నెక్ట్స్ లెవల్ అన్నారు. మరోకరు స్పందిస్తూ.. ముంబై, పూణే మధ్య రైళ్లలో ప్రజలు ఇదే పని చేస్తారు. నాకు కూడా ఈ అనుభవం ఉందని వ్యాఖ్యనించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..