- Telugu News Photo Gallery Eating peanuts has health benefits and increases life know how and why Telugu News
వావ్, వేరు శనగలు తింటే ఇన్ని ప్రయోజనాలా..! ఆయుష్షు పెరుగుతుందట..!!
వేరుశెనగలని పలు రకాల వంటలో వాడుతుంటారు. అంతేకాదు..పచ్చివి కూడా తింటారు. మీరు వేరుశెనగలను ఇష్టంగా తింటున్నారా..? మీ సమాధానం అవును అయితే, ప్రయోజనాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వేరుశెనగను అనేక రకాలుగా తింటారు. వేయించిన, పచ్చి, నానబెట్టిన, ఉడికించిన వేరుశెనగలను కూడా తింటారు. వేరు శనగలో చాలా పోషకాలు ఉంటాయి.
Updated on: Sep 19, 2023 | 5:10 PM

వేరు శనగలు తినడంతో శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. వేరుశెనగ మిమ్మల్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేలా చేస్తుందని పరిశోధకులు కూడా నిర్ధారించారు. వేరుశెనగ మంచి పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వేరుశెనగలో ప్రోటీన్, ఫైబర్, పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. వేరుశెనగలను వేయించి ఉడకబెట్టినప్పుడు, బయోయాక్టివ్ సమ్మేళనాల పరిమాణం పెరుగుతుంది. వీటిలో ప్రోటీన్స్, సెలీనీయం, మెగ్నీషియం, ఐరన్ లభిస్తుంది.

ఉడికించిన వేరుశెనగ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని పరిశోధనలో తేలింది. వేరుశెనగలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

పచ్చి వేరుశెనగ కంటే నీటిలో నానబెట్టిన వేరుశెనగ ఎక్కువ ప్రయోజనకరమని చైనాలోని షాంఘై యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. నానబెట్టిన, మొలకెత్తిన వేరుశెనగలో ఫినాలిక్ సమ్మేళనాలు అధిక స్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు.

పచ్చి, వేయించిన వేరుశెనగ కంటే ఉడికించిన వేరుశెనగలో ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర వ్యాధులను నిరోధించడంలో సహాయపడతాయి. వేరుశనగలో బెల్లం కలిపి తినటం కూడా ఆరోగ్యం.





























