Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Signature Loan: సిగ్నేచర్‌ లోన్‌.. ! కేవలం ఒక సంతకంతో మీ ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది..!

సిగ్నేచర్ లోన్స్‌ అనేవి.. గుడ్‌విల్ లోన్‌లు లేదా అర్హత కలిగిన రుణాలు అని కూడా అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది కూడా ఒక రకమైన వ్యక్తిగత రుణం(పర్సనల్‌లోన్‌) అని చెప్పాలి. బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాలను అందజేస్తాయి. దీని వడ్డీ రేటు గృహ రుణం, వ్యక్తిగత రుణం, విద్యా రుణం కంటే ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, దాని వడ్డీ రేటు క్రెడిట్ కార్డ్ వడ్డీ రేటు కంటే తక్కువగా ఉంటుంది.

Signature Loan: సిగ్నేచర్‌ లోన్‌.. ! కేవలం ఒక సంతకంతో మీ ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది..!
Signature Loan
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 20, 2023 | 8:41 AM

మీరు హోమ్ లోన్ , ఎడ్యుకేషన్ లోన్ , పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ గురించి వినే ఉంటారు. మనలో చాలామంది గృహ రుణం లేదా వ్యక్తిగత రుణం తీసుకుని కూడా ఉంటారు. ఇల్లు లేదా వ్యక్తిగత రుణం పొందాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, మీ ఆదాయం కూడా స్థిరంగా ఉంటే, బ్యాంకు లోన్‌ అప్రూవల్‌ ఈజీగానే వస్తుంది.. ఇక బ్యాంక్‌ లోన్‌ తీసుకోవాలంటే.. కొన్ని డాక్యుమెంట్లు, ఐడీ ప్రూఫ్‌లను బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ, సిగ్నేచర్ లోన్ విషయంలో అటువంటి ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక వ్యక్తి సంతకంపై బ్యాంకు ఇస్తున్న భిన్నమైన రుణం. ఇక్కడ విశేషమేమిటంటే, చాలా మంది సిగ్నేచర్‌ లోన్‌ అనే పేరు కూడా వినలేదు. గృహ రుణం, వ్యక్తిగత రుణం, విద్యా రుణాల గురించి చాలా మందికి తెలుసు. కానీ, సిగ్నేచర్ రుణాలను కూడా బ్యాంకులు నిర్వహిస్తాయి. సిగ్నేచర్ లోన్ తీసుకోవడానికి ఒకరు దానిపై సంతకం చేస్తే చాలు, లోన్ మొత్తం అతని ఖాతాకు బదిలీ చేయబడుతుంది. కాబట్టి సిగ్నేచర్ లోన్ అంటే ఏమిటి..? ఈ లోన్ ఎలాంటి వ్యక్తులు పొందుతారో తెలుసుకుందాం.

సిగ్నేచర్‌ లోన్‌.. వడ్డీ రేట్లు కూడా తక్కువే..

సిగ్నేచర్ లోన్స్‌ అనేవి.. గుడ్‌విల్ లోన్‌లు లేదా అర్హత కలిగిన రుణాలు అని కూడా అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది కూడా ఒక రకమైన వ్యక్తిగత రుణం(పర్సనల్‌లోన్‌) అని చెప్పాలి. బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాలను అందజేస్తాయి. దీని వడ్డీ రేటు గృహ రుణం, వ్యక్తిగత రుణం, విద్యా రుణం కంటే ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, దాని వడ్డీ రేటు క్రెడిట్ కార్డ్ వడ్డీ రేటు కంటే తక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రుణం ఎవరికి వస్తుంది..?

సిగ్నేచర్‌ లోన్‌ అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే, ఈ రుణాన్ని మంజూరు చేయడానికి ముందు బ్యాంక్ కస్టమర్ క్రెడిట్ లిస్ట్‌ చెక్‌ చేస్తుంది. మీ క్రెడిట్ స్కోరు 580 నుంచి 700 వరకు ఉండాలి. అలాగే నెలవారీ పేమెంట్లు చేసేందుకు తగినంత ఆదాయం పొందుతూ ఉండాలి. లోన్ తప్పక చెల్లిస్తానని మీరు హామీ ఇవ్వాలి. రుణగ్రహీత రుణాన్ని సులభంగా తిరిగి చెల్లిస్తాడని బ్యాంకు పూర్తిగా నమ్మకంతో ఉన్నప్పుడే, బ్యాంక్‌ లోన్‌ పాస్ చేస్తుంది. అదే సమయంలో, సిగ్నేచర్‌ లోన్‌ మంజూరు చేయడానికి ముందు బ్యాంకు చాలాసార్లు సాక్షి సంతకాన్ని కూడా తీసుకుంటుంది. అయితే, రుణం మంజూరు చేసిన తర్వాత, రుణగ్రహీత EMI చెల్లించనప్పుడు బ్యాంకు గ్యారంటర్‌ను అడుగుతుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

7 అడుగుల గొయ్యి తీసి.. యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు..!
7 అడుగుల గొయ్యి తీసి.. యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు..!
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
మొక్కలు పుష్పించడం లేదా.. బియ్యం బెస్ట్ ఎరువు.. ఎలా యూజ్ చేయాలంటే
మొక్కలు పుష్పించడం లేదా.. బియ్యం బెస్ట్ ఎరువు.. ఎలా యూజ్ చేయాలంటే
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం