SBI Insta Plus Savings Account: ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఒక్క వీడియో కాల్‌తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.. ఎస్బీఐ అద్భుతమైన ఫీచర్..
ఆన్ లైన్ లోనే ఎస్బీఐ ఖాతాను ఓపెన్ చేసే వెసులుబాటు దొరికింది. బ్రాంచ్ వద్దకు వెళ్లకుండానే యోనో యాప్ సాయంతోనే అకౌంట్ ఓపెన్ చేసేలా ఈ కొత్త ఫీచర్ ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను ఎస్బీఐ అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. మీరు ఎప్పుడైనా.. ఎక్కడైనా ఎస్బీఐ బ్యాంక్ ఖాతాను ప్రారంభించవచ్చని, అందుకోసం కేవైసీ వీడియో ఫంక్షన్ తీసుకొచ్చినట్లు చెప్పింది.

వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన సేవలు అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఇప్పటికే ఇతర ఏ నేషనలైజ్డ్ బ్యాంకు అందివ్వని విధంగా పూర్తి భద్రత, భరోసాతో కూడిన ఆన్ లైన్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, యాప్ ల సాయంతో సేవలను అందిస్తోంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా సకల సేవలను అరచేతిలోకి తీసుకొచ్చింది. యాప్ నుంచే ఎన్ఆర్ఐ లకు డిజిటల్ ఖాతాలను కూడా ప్రారంభించింది. ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతాలను యోనో యాప్ ద్వారా ప్రారంభించే వెసులు బాటును తీసుకొచ్చింది. ఇప్పుడు అదే క్రమంలో వీడియో కేవైసీ ఆధారంగా అకౌంట్ ప్రారంభించే ఫీచర్ను ప్రకటించింది. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులు ఆన్ లైన్ లోనే ఎస్బీఐ ఖాతాను ఓపెన్ చేసే వెసులుబాటు దొరికింది. బ్రాంచ్ వద్దకు వెళ్లకుండానే యోనో యాప్ సాయంతోనే అకౌంట్ ఓపెన్ చేసేలా ఈ కొత్త ఫీచర్ ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను ఎస్బీఐ అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. మీరు ఎప్పుడైనా.. ఎక్కడైనా ఎస్బీఐ బ్యాంక్ ఖాతాను ప్రారంభించవచ్చని, అందుకోసం కేవైసీ వీడియో ఫంక్షన్ తీసుకొచ్చినట్లు చెప్పింది. ఎస్బీఐ అందిస్తోన్న ఈ డిజిటల్ అకౌంట్ పేరు ఎస్బీఐ ఇన్ స్టా ప్లస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
You may open a #SavingsAccount with us without going to the bank. You may create a savings account ANYTIME and ANYWHERE thanks to the brand-new KYC video function, which streamlines the procedure. Apply now on YONO!#SBI #KYC #DigitalSavingAccount #YONOSBI #AmritMahotsav pic.twitter.com/XlclpMFy0M
ఇవి కూడా చదవండి— State Bank of India (@TheOfficialSBI) September 3, 2022
వీడియో కేవైసీతో ఖాతా ప్రారంభించడం ఇలా..
- యోనో అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేయండి.
- ఇప్పుడు “న్యూ టు ఎస్బీఐ” ఎంపికపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు “ఓపెన్ సేవింగ్స్ అకౌంట్” ఎంపికపై క్లిక్ చేయండి. ఆ తర్వాత “వితౌట్ బ్రాంచ్ విజిట్” ఎంపికపై క్లిక్ చేయండి.
- “ఐ వాంట్ టు ఓపెన్ శాలరీ అకౌంట్” అని ఉన్న బాక్స్ లో టిక్ చేయండి.
- ఇప్పుడు కొత్త దరఖాస్తును ప్రారంభించండి.
- వివరాలను చదివి, చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ పాన్ , ఆధార్ వివరాలను నమోదు చేయండి.
- ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి.
- ఇతర సంబంధిత వివరాలను నమోదు చేయండి.
- వీడియో కాల్‌ని షెడ్యూల్ చేయండి.
- రెజ్యూమ్ ద్వారా నిర్ణీత సమయంలో యోనో యాప్‌కి లాగిన్ చేసి, వీడియో కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.
- దీంతో మీ ఇన్‌స్టా ప్లస్ సేవింగ్స్ ఖాతా ఓపెన్ అవుతుంది. బ్యాంక్ అధికారులు ధ్రువీకరించిన తర్వాత డెబిట్ లావాదేవీల కోసం ఖాతా యాక్టివేట్ అవుతుంది.
కొత్త విధానంలో ఫీచర్లు ఇవే..
- వీడియో కేవైసీ ద్వారా మీరు ఎస్బీఐ ఇన్‌స్టా ప్లస్ సేవింగ్ బ్యాంక్ ఖాతాను తెరవండి.
- పేపర్‌లెస్ గా ఖాతాను తెరవచ్చు. దీనికోసం బ్రాంచ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.
- ఆధార్ వివరాలు & పాన్ (భౌతికం) మాత్రమే అవసరం.
- కస్టమర్లు యోనో యాప్ లేదా ఆన్‌లైన్ ఎస్బీఐ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ మొదలైన వాటిని ఉపయోగించి నిధులను బదిలీ చేయవచ్చు.
- రూపే క్లాసిక్ కార్డ్ మీకు జారీ చేస్తారు.
- యోనో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా 24*7 సేవలను యాక్సెస్ చేయొచ్చు.
- ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఎస్బీఐ క్విక్ మిస్డ్ కాల్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
- ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఛానెల్ ద్వారా ఖాతాలు బదిలీ చేసుకోవచ్చు.
- నామినేషన్ తప్పనిసరి.
- అయితే ఈ ఖాతాపై చెక్ బుక్ జారీ ఇవ్వరు. అలాగే బ్రాంచ్‌లో డెబిట్/వోచర్ లావాదేవీలు లేదా ఇతర సంతకం ఆధారిత సేవలు అనుమతించరు. మీకు ఒకవేళ చెక్ బుక్ కావాలనుకుంటే కస్టమర్ హోమ్ బ్రాంచ్‌ని సందర్శించి, సంతకాన్ని అప్‌డేట్ చేసిన తర్వాత ఇస్తారు.
- వినియోగదారుడు కోరితే పాస్‌బుక్ కూడా జారీ చేస్తారు.
- అన్ని ఇతర సేవలకు సంబంధించిన చార్జీలు సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు వర్తించే విధంగానే ఉంటాయి.
Open a Saving account with a quick video KYC feature! It’s contactless, safe and secure, download the SBI YONO app and get started with your savings journey today!#SBI #SavingAccounts #KYC #DigitalSavingAccount #YONOSBI #AmritMahotsav pic.twitter.com/Psgzq3xwJk
— State Bank of India (@TheOfficialSBI) August 30, 2022
ఖాతా ప్రారంభానికి అర్హతలు..
18 ఏళ్లు పైబడిన భారతీయ నివాసి అయిఉండాలి. తప్పనిసరిగా అక్షరాస్యుడై ఉండాలి. కొత్త వినియోగదారులకు మాత్రమే ఈ ఖాతా ఓపెన్ అవుతుంది. ఇప్పటికే ఎస్బీఐలో ఖాతా కలిగి ఉన్న వారికి ఇది వర్తించదు. మోడ్ ఆఫ్ ఆపరేషన్ కేవలం సింగిల్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..