AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చంద్రబాబు వార్త వస్తే చాలు టీవీ ఆఫ్ చేస్తున్నా.. కోమటిరెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్..

MP Komatireddy Venkat Reddy: తెలంగాణలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పనిలో పనిగా.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

Telangana: చంద్రబాబు వార్త వస్తే చాలు టీవీ ఆఫ్ చేస్తున్నా.. కోమటిరెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్..
MP Komatireddy Venkat Reddy
Shiva Prajapati
|

Updated on: Sep 29, 2023 | 1:13 PM

Share

MP Komatireddy Venkat Reddy: తెలంగాణలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పనిలో పనిగా.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. చంద్రబాబు అరెస్ట్‌ అంశంపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. టీవీ ఛానళ్లలో బాబు కేసులకు సంబంధించిన కథనాలు వస్తుంటే వెంటనే టీవీ ఆఫ్ చేస్తున్నానని అన్నారు. చంద్రబాబుకు సంబంధించిన వార్తలు చదవడమే మానేశానని అన్నారు. అసలు బాబు అరెస్ట్‌పై తానేమీ మాట్లాడదలుచుకోలేదన్నారు. అయినా, ఆంధ్రా గురించి తమకెందుకు అంటూ ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేశారు. తమ దృష్టి అంతా కేసీఆర్‌ను సీఎం కుర్చీ నుంచి దించడంపైనే ఉంటుందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీ ఇచ్చిన 6 హామీలను అమలు చేస్తామన్నారు. తాము చేసే చెబుతామని, చెప్పింది చేసి తీరుతామన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా 80 నుంచి 85 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. ఈసారి కేసీఆర్ ఇంటికి వెళ్లడం ఖాయం అని వ్యాఖ్యానించారు. డబ్బు తీసుకుని టికెట్లు ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదన్నారు ఎంపీ. టిక్కెట్ల అంశంపై పార్టీ అధిష్టానంతో మాట్లాడుకుంటానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పార్టీలో ఉన్న సమస్యలపై కూడా ఢిల్లీలోనే మాట్లాడుతానని అన్నారు.

ఇదే సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ టార్గెట్‌గా మంత్రి హరీష్ రావు ఇటీవల చేసిన కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ‘హరీష్‌… బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుందో తెలుసుకో!’ అంటూ మంత్రికి హితవు చెప్పారు కోమటిరెడ్డి. కోట్ల రూపాయకు టిక్కెట్లు అమ్ముకోలేదా? అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. టిక్కె్ట్లు అమ్ముకునే పరిస్థితి బీఆర్‌ఎస్‌లోనే ఉందన్నారు.

మంత్రి హరీష్ రావుకు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణలో వ్యవసాయానికి 24గంటల కరెంట్‌ ఇస్తున్నట్టు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఒకవేళ నిరూపించకపోతే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్ పేరు మార్చుకున్నప్పుడే ఆ పార్టీ కథ ముగిసిందని వ్యాఖ్యానించారు. ఎవరైనా తెలంగాణ పేరును మార్చుకుంటారా? అని ప్రశించారు ఎంపీ. మరి బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకున్న పార్టీ.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు ఎంపీ. సీఎం కేసీఆర్‌ది రజాకార్ల పాలన అని విమర్శించారు కోమటిరెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..