World Cup 2023: ఆస్తుల జప్తుపై హైకోర్టును ఆశ్రయించిన హెచ్‌సీఏ.. నేడు విచారణకు రానున్న పిటిషన్
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం (సెప్టెంబర్ 29) నుంచి వార్మప్ మ్యాచ్‌లు జరగనుండగా. మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో గతేడాది ఫైనలిస్టు న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కాగా భద్రతా కారణాలతో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదు.

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం (సెప్టెంబర్ 29) నుంచి వార్మప్ మ్యాచ్‌లు జరగనుండగా. మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో గతేడాది ఫైనలిస్టు న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కాగా భద్రతా కారణాలతో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. అయితే ఈ నిబంధన ఇదొక్క మ్యాచ్‌కే పరిమితం. తర్వాతి మ్యాచ్‌లు యథావిధిగా అభిమానుల సమక్షంలోనే జరగనున్నాయి. హైదరాబాద్ వేదికగా రెండు వార్మప్ మ్యాచ్‌లు.. మూడు ప్రధాన మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఓ వాణిజ్య వివాదం విషయంలో హెచ్‌సీఏకు చెందిన అన్ని ఆస్తులు, బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని సెప్టెంబర్ 22న రంగారెడ్డి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై హైదరాబాద్ క్రికెట్ సంఘం హైకోర్టును ఆశ్రయించింది. తమ వాదనలు వినకుండానే ట్రయల్ కోర్టు ఆస్తుల జప్తు ఆదేశాలు జారీ చేసిందని హెచ్‌సీఏ అడ్మినిస్ర్టేటర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ.40 కోట్లు చెల్లించాలంటూ ఆర్బిట్రేషన్ అవార్డు జారీ అయిందని ఇందులో వివరించారు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు. దీనిపై తాము కోర్టును ఆశ్రయించామని అది విచారణలో ఉండగానే ఆర్బిట్రేషన్ అవార్డు అమలు కోసం విశాఖ ఇండస్ట్రీస్ ట్రయల్ కోర్టుకు వెళ్లిందని ఆయన తెలిపారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి విశాఖ ఇండస్ట్రీస్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య 2004లో ఒక ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో విశాఖ ఇండస్ట్రీస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే హెచ్‌సీఏకు చెందిన అన్ని ఆస్తులు, బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని సెప్టెంబర్ 22న రంగారెడ్డి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ విషయంపైనే హైకోర్టును ఆశ్రయించింది హెచ్‌సీఏ.
దిగువ కోర్టు అటాచ్ చేసిన స్టేడియం, బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది హెచ్‌సీఏ. ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌కు ముందు హెచ్‌సీఏపై ఒత్తిడి తెచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఈ పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారిస్తామని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే ధర్మాసనం తెలిపింది. కాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా రెండు వామప్ మ్యాచ్‌లు.. మూడు ప్రధాన మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 29న పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్‌తో పాటు అక్టోబర్ 3న పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ ఇక్కడే జరగనుంది. ఇక ప్రధాన మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్ 6న పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. అలాగే అక్టోబర్ 9న న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్, అక్టోబర్ 10న పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లు కూడా ఇదే మైదానంలోనే జరగనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..