మరో 6 రోజుల్లో ప్రపంచకప్.. ముందుగా అసలు సిసలైన పోరు.. పాక్ కంబ్యాక్ ఇచ్చేనా.?
వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ఒడిసి పట్టేందుకు జట్లన్నీ కూడా హోరాహోరీ యుద్దానికి సిద్దమయ్యాయి. ఇండియాలోకి వచ్చేసిన 10 జట్లు.. అసలు సంగ్రామానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లకి రెడీ అయ్యాయి. ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా వార్మప్ మ్యాచ్‌కి సిద్ధమయ్యాయి న్యూజిలాండ్ - పాక్ జట్లు. ఇక ప్రధాన మ్యాచ్‌కు ముందుగా బాబర్ ఆజామ్ టీంకు అసలు సిసలైన పరీక్షను ఎదుర్కోనుంది..

వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ఒడిసి పట్టేందుకు జట్లన్నీ కూడా హోరాహోరీ యుద్దానికి సిద్దమయ్యాయి. ఇండియాలోకి వచ్చేసిన 10 జట్లు.. అసలు సంగ్రామానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లకి రెడీ అయ్యాయి. ఇవాళ మూడు వార్మప్ మ్యాచ్‌లు జరగనుండగా.. బంగ్లాదేశ్ – శ్రీలంక వార్మప్ మ్యాచ్ గౌహతిలో, సౌతాఫ్రికా – ఆఫ్గనిస్తాన్ వార్మప్ మ్యాచ్ తిరువనంతపురంలో, హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా వార్మప్ మ్యాచ్‌కి న్యూజిలాండ్ – పాక్ జట్లు సిద్ధమయ్యాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 సమయం ఆసన్నమైంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే ప్రపంచకప్ బరిలోకి దిగే జట్లన్నీ భారత్ చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. వార్మప్ మ్యాచ్‌లు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ వేదికగా రెండు వార్మప్ మ్యాచ్‌లు.. మూడు ప్రధాన మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. అయితే ఈ వార్మప్ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. గణేష్ నిమజ్జనం కారణంగా బందోబస్తు ఇవ్వలేమని హైదరాబాద్ పోలీసులు చెప్పడంతో అయోమయం నెలకొంది. దీంతో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రెడీ అయింది.
ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. ఐటీసీ కాకతీయ హోటల్‌లో కివీస్ జట్టు ఉండగా.. పాకిస్థాన్ జట్టు సైతం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి పార్క్ హయత్‌కు చేరుకుంది. వార్మప్ మ్యాచ్‌లన్నీ 50ఓవర్ల ఫార్మాట్‌లోనే జరుగుతాయి. ప్రతీ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 5 న ఈ మెగా టోర్నీ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. 2019 రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. 46 రోజులపాటు సాగే ఈ టోర్నీ.. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. ఇక వార్మప్ మ్యాచ్‌లు, ప్రధాన మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్, డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లలో ఉచితంగా చూడొచ్చు.
వన్డే వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్ జట్టు ఇదే..
బాబర్ ఆజామ్(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఇమామ్-ఉల్-హక్ , ఫఖర్ జమాన్, అబ్దుల్లా షఫీక్, ఇఫ్తీకర్ అహ్మద్, సౌద్ షకీల్, అఘా సల్మాన్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీమ్ జూనియర్, హరీస్ రూఫ్, హాసన్ అలీ, ఉసామా మిర్
వన్డే వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్ జట్టు ఇదే..
కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ లాథమ్(వికెట్ కీపర్), విల్ యంగ్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మార్క్ చాప్మన్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, లోకీ ఫెర్గుసన్
హైదరాబాద్‌లో పాకిస్తాన్ జట్టు మొదటి ప్రాక్టీస్ సెషన్..
Gearing 🆙
First net session of the @cricketworldcup 🏏#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/Y7dzaRquXb
— Pakistan Cricket (@TheRealPCB) September 28, 2023
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




