Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England: ఇంగ్లండ్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌.. గౌహతీ చేరుకున్న టీమిండియా.. లైవ్‌ మ్యాచ్‌ ఎక్కడ చూడొచ్చంటే?

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ మెగా క్రికెట్‌ టోర్నీ అక్టోబర్ 5న భారత్‌లో ప్రారంభం కానుంది. దీనికి ముందు శుక్రవారం (సెప్టెంబర్‌ 29) నుంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు కూడా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. భారత్ తన తొలి వార్మప్ మ్యాచ్‌లో జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్‌తో తలపడనుంది.

India vs England: ఇంగ్లండ్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌.. గౌహతీ చేరుకున్న టీమిండియా.. లైవ్‌ మ్యాచ్‌ ఎక్కడ చూడొచ్చంటే?
India vs England
Follow us
Basha Shek

|

Updated on: Sep 29, 2023 | 12:34 PM

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ మెగా క్రికెట్‌ టోర్నీ అక్టోబర్ 5న భారత్‌లో ప్రారంభం కానుంది. దీనికి ముందు శుక్రవారం (సెప్టెంబర్‌ 29) నుంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు కూడా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. భారత్ తన తొలి వార్మప్ మ్యాచ్‌లో జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్‌తో తలపడనుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ప్రాక్టీస్ మ్యాచ్‌కోసం భారత ఆటగాళ్లు గౌహతి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు రాగానే వేలాది మంది అభిమానులు భారత జట్టుకు స్వాగత పలికారు. ప్రపంచకప్ జట్టులో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ కూడా మెన్ ఇన్ బ్లూతో కలిసి గౌహతి చేరుకున్నాడు. కాగా, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా నేడు భారత జట్టులో చేరనున్నారు. ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ఓపెనర్‌కు ముందు రోహిత్ సేన రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉంది. సెప్టెంబరు 30న గౌహతిలో ఇంగ్లండ్‌తో, అక్టోబరు 3న తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో టీమ్ ఇండియా తన చివరి వార్మప్ మ్యాచ్‌ను ఆడనుంది. కాగా జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు గురువారం సాయంత్రం ముంబైలో దిగి అర్ధరాత్రి గౌహతి చేరుకుంది. భారత్, ఇంగ్లండ్ క్రికెట్ జట్లు రాడిసన్ బ్లూ హోటల్‌లో బస చేయనున్నాయని సమాచారం.

అక్షర్ స్థానంలో అశ్విన్

2023 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా పెద్ద మార్పు చేసింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయం నుంచి సకాలంలో కోలుకోపోవడంతో అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ని తీసుకున్నారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు అశ్విన్‌ ఎంపికయ్యాడు. తొలి రెండు వన్డేల్లో మంచి ప్రదర్శన చేయడంతో వరల్డ్‌కప్‌ టీంలో స్థానం సంపాదించుకున్నాడు. కాగా ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అలాగే హాట్‌ స్టార్‌ యాప్‌లోనూ లైవ్‌ చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ బుమ్రా , మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.

ఇంగ్లండ్ జట్టు:

జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్ , క్రిస్ వోక్స్.

గౌహతీలో టీమిండియాకు ఘన స్వాగతం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జాబిల్లి ఈమె వద్ద వెన్నెలను అప్పుగా తీసుకుంది.. డేజ్లింగ్ మిర్న..
జాబిల్లి ఈమె వద్ద వెన్నెలను అప్పుగా తీసుకుంది.. డేజ్లింగ్ మిర్న..
నల్లగా ఉన్నాయని దూరం పెట్టకండి.. కలోంజితో కలిగే లాభాలు తెలిస్తే..
నల్లగా ఉన్నాయని దూరం పెట్టకండి.. కలోంజితో కలిగే లాభాలు తెలిస్తే..
బాక్సర్ కావాల్సిన అమ్మాయి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
బాక్సర్ కావాల్సిన అమ్మాయి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
సెలబ్రిటీ మేక.. ప్రపంచంలోనే ఇలాంటి జీవి మరొకటి లేదట!
సెలబ్రిటీ మేక.. ప్రపంచంలోనే ఇలాంటి జీవి మరొకటి లేదట!
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
ఈ జియో ప్లాన్‌లలో ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌..
ఈ జియో ప్లాన్‌లలో ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌..
పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా? ఆ ఒక్క తప్పుతో ..
పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా? ఆ ఒక్క తప్పుతో ..
ఏడుగురు అమ్మాయిలు.. 13 మంది అబ్బాయిలు.. ఫామ్‌ హౌస్‌లో అర్ధరాత్రి
ఏడుగురు అమ్మాయిలు.. 13 మంది అబ్బాయిలు.. ఫామ్‌ హౌస్‌లో అర్ధరాత్రి
రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్.. ఏంటో తెలుసా?
రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్.. ఏంటో తెలుసా?
విల్లు వంటి ఒంపు సొంపులతో వలపు బాణాలు సందింస్తున్న మాళవిక..
విల్లు వంటి ఒంపు సొంపులతో వలపు బాణాలు సందింస్తున్న మాళవిక..