AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ నెట్ బౌలర్‌గా హైదరాబాదీ పేసర్.. ఏకంగా బౌన్సర్లతో బాబర్‌కే చెమటలు పట్టించాడు.. ఎవరంటే.?

మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. సుమారు ఏడేళ్ల తర్వాత వన్డే వరల్డ్‌కప్ కోసం భారత్‌లో అడుగుపెట్టింది పాకిస్తాన్ జట్టు. తొలి సన్నాహక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పోటీపడేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఇక పాకిస్తాన్ ప్రాక్టీస్ సెషన్లలో ఓ హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.

పాక్ నెట్ బౌలర్‌గా హైదరాబాదీ పేసర్.. ఏకంగా బౌన్సర్లతో బాబర్‌కే చెమటలు పట్టించాడు.. ఎవరంటే.?
Babar Azam Vs Nisanth Saran
Ravi Kiran
|

Updated on: Sep 29, 2023 | 12:45 PM

Share

మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. సుమారు ఏడేళ్ల తర్వాత వన్డే వరల్డ్‌కప్ కోసం భారత్‌లో అడుగుపెట్టింది పాకిస్తాన్ జట్టు. హైదరాబాద్‌లో ఫ్యాన్స్ నుంచి ఘన స్వాగతం అందుకున్న పాక్ జట్టు.. తన తొలి సన్నాహక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పోటీపడేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఇక పాకిస్తాన్ ప్రాక్టీస్ సెషన్లలో ఓ హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్ జట్టు అతడ్ని తమ నెట్ బౌలర్‌గా నియమించుకుంది. మరి ఇంతకీ అతడెవరు.? ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందామా..

హైదరాబాద్ అండర్-19 ఫాస్ట్ బౌలర్ నిశాంత్ సరను పాకిస్తాన్ నెట్ బౌలర్‌గా.. ఆ జట్టు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నాడు. కివీస్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌కు ముందుగా పాకిస్తాన్ బ్యాటర్లైన బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్, జమాన్ తదితరులు.. నిశాంత్ సరను 140 నుంచి 150 వేగంతో విసిరే బంతులను ఎదుర్కుంటున్నారు. ఈ హైదరాబాదీ యువ పేసర్ ఆరడుగుల ఐదు అంగుళాల పైగా ఉండటంతో నిశాంత్ షార్ట్ బాల్స్, బౌన్సర్లు కూడా సంధించగలడు. ఇక నిశాంత్ పదునైన బంతులను ఎదుర్కున్న ఫఖర్ జమాన్.. అతడి బౌలింగ్‌కు ఫిదా అయిపోయి.. ప్రశంసలు కురిపించాడు.

“నేను ప్రస్తుతం గంటకు 125-130 కి.మీ వేగంతో బంతులు సంధించగలను. మోర్కెల్ సర్ నా వేగాన్ని పెంచమని అడిగారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ నెట్స్‌లో బౌలింగ్ చేయడానికి అందుబాటులో ఉంటానా అని కూడా అడిగారు” అని నిశాంత్ చెప్పాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా పేస్ ద్వయం మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్‌ను తన ఇన్‌స్పిరేషన్‌ అని చెప్పుకొచ్చాడు నిశాంత్.

అంతర్జాతీయ బ్యాటర్లకు బౌలింగ్‌ చేయడం నిశాంత్‌కు ఇది కొత్తేమి కాదు.. భారత్-న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌కు ముందుగా కూడా నెట్ బౌలర్‌గా నిశాంత్ తన బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ సమయంలో కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దాదాపు రెండు వారాల పాటు పాకిస్తాన్ జట్టు హైదరాబాద్‌లోనే ఉంటుంది కాబట్టి.. నిశాంత్‌కు బౌలింగ్ చేసేందుకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. తన లక్ష్యం వైట్, రెడ్ బాల్ క్రికెట్‌లో కెరీర్ ప్రారంభించడమేనని.. త్వరలోనే హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తానన్నాడు నిశాంత్ సరను.

వన్డే వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్ జట్టు ఇదే..

బాబర్ ఆజామ్(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఇమామ్-ఉల్-హక్ , ఫఖర్ జమాన్, అబ్దుల్లా షఫీక్, ఇఫ్తీకర్ అహ్మద్, సౌద్ షకీల్, అఘా సల్మాన్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీమ్ జూనియర్, హరీస్ రూఫ్, హాసన్ అలీ, ఉసామా మిర్

వన్డే వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్ జట్టు ఇదే..

కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ లాథమ్(వికెట్ కీపర్), విల్ యంగ్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మార్క్ చాప్మన్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, లోకీ ఫెర్గుసన్

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..