AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియా పోస్టులతో వేడెక్కిన పాలకుర్తి రాజకీయం.. పోస్టింగ్స్ వెనక సీక్రెట్ హ్యాండ్ ఎవరిది?

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అధికార పార్టీ బీఆర్ఎస్, విపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లతో పాలకుర్తి రాజకీయం వేడెక్కింది. ఆందోళనలతో పాటు కేసుల దాకా వెళ్లారు బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ నేతలు. ఇంతకీ పోస్టింగ్‌ల సృష్టి వెనుక ఉన్నదెవరు? అసలు ఆ వివరాలు ఏంటి.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.? 

సోషల్ మీడియా పోస్టులతో వేడెక్కిన పాలకుర్తి రాజకీయం.. పోస్టింగ్స్ వెనక సీక్రెట్ హ్యాండ్ ఎవరిది?
Brs Vs Congress
Ravi Kiran
|

Updated on: Sep 29, 2023 | 1:20 PM

Share

హైదరాబాద్, సెప్టెంబర్ 29: సోషల్ మీడియాలో పోస్టింగ్‌లతో పాలకుర్తి రాజకీయం వేడెక్కింది. ఆందోళనలతో పాటు కేసుల దాకా వెళ్లారు బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ నేతలు. ఇంతకీ పోస్టింగ్‌ల సృష్టి వెనుక ఉన్నదెవరు? అసలు ఆ వివరాలు ఏంటి.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.?

పోరాటాల పురిటిగడ్డ పాలకుర్తి నియోజకవర్గం. వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. చారిత్రక నేపథ్యమున్న ఈ నియోజకవర్గానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుస్తారా? ప్రజల్లో వ్యతిరేకత ఉందా? విపక్ష అభ్యర్థులు బలమైన వాళ్లయితే ఎర్రబెల్లికి కష్టాలు తప్పవా అన్న సంగతి పక్కన పెడితే.. ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు రాజకీయంగా నియోజకవర్గంలో ప్రకంపనలు పుట్టించాయి.

రెండు రోజుల క్రితం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్‌‌గా మారాయి. మంత్రికి వ్యతిరేకంగా ఉన్న ఆ పోస్టులు కాంగ్రెస్‌ నేతల పనేననంటూ బీఆర్‌ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారాలను వైరల్‌ చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై అటు కాంగ్రెస్ నేతలు కూడా ఓ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కేసులను నిరసిస్తూ రాజీవ్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. మరోవైపు బీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా పోటీగా దూసుకొచ్చారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రెండు వర్గాలూ హోరాహరీ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు తీవ్రంగా శ్రమించారు.

ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు కిందామీదా పడ్డారు పోలీసులు. అతి కష్టం మీద బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్ కార్యకర్తల్ని చెదరగొట్టారు. బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ల ఆందోళనతో రహదారిపై కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు గంటలకొద్ది ఇబ్బంది పడ్డారు. మొత్తానికి సోషల్ మీడియాలో పోస్టింగ్‌ల పర్వం పాలకుర్తిని షేక్ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల ఇక్కడ క్లిక్ చేయండి..