Ganesh Immersion: బాబోయ్.. ఒక్క రోజే 67 చోరీ కేసులు.. ట్యాంక్‌బండ్ అడ్డాగా రెచ్చిపోయిన కేటుగాళ్లు..
Hyderabad Ganesh Immersion: హైదరాబాద్‌లో ఓవైపు గణేషుడి శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగుతోంది. మరోవైపు.. అదే మంచి ఛాన్స్ అంటూ రెచ్చిపోయారు జేబు దొంగలు. భారీగా తరలివచ్చిన జనాలనే ఆసరాగా చేసుకుని తమ చేతివాటం ప్రదర్శించారు కేటుగాళ్లు. వేలాది గణపయ్యాలు ఒక్కొక్కరుగా గంగమ్మ ఒడికి చేరుతుంటే.. ఆ అద్భుత, సుందర దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు సాగర తీరానికి తరలి వచ్చారు.

Hyderabad Ganesh Immersion: హైదరాబాద్‌లో ఓవైపు గణేషుడి శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగుతోంది. మరోవైపు.. అదే మంచి ఛాన్స్ అంటూ రెచ్చిపోయారు జేబు దొంగలు. భారీగా తరలివచ్చిన జనాలనే ఆసరాగా చేసుకుని తమ చేతివాటం ప్రదర్శించారు కేటుగాళ్లు. వేలాది గణపయ్యాలు ఒక్కొక్కరుగా గంగమ్మ ఒడికి చేరుతుంటే.. ఆ అద్భుత, సుందర దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు సాగర తీరానికి తరలి వచ్చారు. కానీ, మాకు కావాల్సిందే అన్నట్లుగా.. పిక్‌పాకెటర్స్ రెచ్చిపోయారు. అందినకాడికి దోచుకున్నారు. ప్రజల జేబులను కొల్లగొట్టారు. ట్యాంక్‌బండ్‌పై హడావుడిని తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు కేటుగాళ్లు. వేలాది మంది పోలీసులు.. వందలాది కెమెరాల కళ్లుగప్పి.. ప్రజల జేబులను దోచుకున్నారు దొంగలు.
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించినప్పటికీ.. పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్‌లు, మొబైల్ ఫోన్ల చోరీలు భారీగా జరిగాయి. ఒక్క గురువారం రోజే హుస్సేన్ సాగర్ పరిసరాలు 67 చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు. దీన్ని బట్టి నిన్నటి రోజున దొంగలు ఏ రేంజ్‌లో రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చు. ప్రజలను వినాయకులను చూస్తూ నిమజ్జనంలో మునిగిపోతే.. కేటుగాళ్లు మాత్రం తమ పనిని తాము ఈజీగా పూర్తిచేసుకున్నారు. ఈ చోరీలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, డ్రోన్ దృశ్యాలు వంటి వాటిని పరిశీలించి దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
రెండవ రోజు కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు..
కాగా, హైదరాబాద్‌లో రెండవ రోజు కూడా గణేష్ శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగుతోంది. వేలాది గణపతులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. 24 గంటలుగా ఆటంకం లేకుండా యాత్ర కొనసాగుతూ వస్తోంది. ట్యాంక్‌బండ్‌పై ఇంకా హడావుడి కనిపిస్తోంది. భారీ గణేషుల శోభాయాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే, వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. దొంగలు ఉన్నారని, తమ తమ వస్తువుల పట్ల పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇక ఒకే రోజు 67 చోరీ కేసులు నమోదవడంతో పోలీసులు కూడా భద్రతను పటిష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గురువారం జరిగిన చోరీల్లోకెల్లా అతిపెద్ద చోరీ.. ఓ వృద్దుడి నుంచి 20 గ్రాముల బంగారం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 1,500 నగదు ఎత్తుకెళ్లారు. ఫతేనగర్‌కు చెందిన రామ తారకం(63) వద్ద నుంచి ఈ సొమ్మును ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు. దొంగతనం జరిగినప్పుడు నిమజ్జన కార్యక్రమాలలో మునిగిపోయానని, తన వస్తువులన్నీ ఎత్తుకెళ్లారని వాపోయారు. ఇతనొక్కడే కాదు.. ఇలా ఎంతో మంది వద్ద నుంచి ఫోన్లు, డబ్బు, చైన్స్ ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు.
చైన్ స్నాచింగ్ చేసి పారిపోతూ దొంగ మృతి..
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం సర్వారంలో చైన్ స్నాచింగ్ చేసి పారిపోతూ చెరువు గుంతలో పడి ఓ దొంగ మృతి చెందాడు. 35 ఏళ్ల బొంతల రాజ్ కుమార్ అంతకుముందు చోరికి విఫలయత్నం చేయగా వర్కవుట్ కాలేదు. సర్వారంలో మహిళను వేధించడంతో ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. ఆ తర్వాత ఒక కిరాణ షాప్ మహిళ మెడలో నుండి మంగళసూత్రం కొట్టేసి పారిపోయే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
