వ్యాపారాల కోసమే తెలంగాణకు రావద్దు..! ఏపీ పొలిటీషియన్స్ కు తెలంగాణ లీడర్స్ స్మూత్ వార్నింగ్

తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ నేతలు ఇచ్చిన సిఫార్సు లేఖల్ని టీటీడీ అనుమతించకపోవడంపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమలలో తెలంగాణ నాయకులపై ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. ఏపీ నేతలు తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవడం లేదా...? అని కొశ్చన్‌ చేశారు.

వ్యాపారాల కోసమే తెలంగాణకు రావద్దు..! ఏపీ పొలిటీషియన్స్ కు తెలంగాణ లీడర్స్ స్మూత్ వార్నింగ్
Tirumala Temple
Follow us
Raju M P R

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 22, 2024 | 1:45 PM

తిరుమల శ్రీవారి దర్శనంలో తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ప్రియారిటి ఇవ్వాలన్న డిమాండ్ బలపడుతోంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్ల తో తిరుమలకు వచ్చే తెలంగాణ ప్రజలను గౌరవించాలని ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల లేఖలను స్వీకరించని టీటీడీ తీరును తప్పు పడుతున్నారు తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ తిరుమలలో ఈ మేరకు స్పందించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల లెటర్లతో శ్రీవారి దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఆగస్టు 3న డయల్ యువర్ ఈఓ కార్యక్రమం లో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు స్వీకరించమని చెప్పారనీ ఇది కరెక్ట్ కాదన్నారు. రాష్ట్ర విభజన సమయం లో సీఎం చంద్రబాబు రెండు ప్రాంతాలు రెండు కళ్ళన్నారనీ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు ఇప్పుడు ఒక కన్నును తీసివేశారా, లేదంటే పొడుచుకున్నారా అని అడుగుతున్నామన్నారు. తెలంగాణలోని ఆలయాల్లో ఏపీ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే చాలు దర్శనాలు జరుగు తున్నాయన్నారు. తిరుమల దర్శనాల విషయంలో తెలంగాణ పై ఎందుకంత చిన్నచూపు అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళ నియోజక వర్గ ప్రజలకు తిరుమలలో రూమ్ లు ఇప్పించే పరిస్థితిలో కూడా లేరన్నారు.

ఏపీలోని అన్ని పార్టీలకు చెందినవారు తెలంగాణలో వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఏపీ ప్రజా ప్రతినిధులు తెలంగాణలో వ్యాపారాలు చేసుకుంటే మేమెప్పుడు ప్రశ్నించలేదన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు అందరూ ఒక్క తీర్మానం చేసుకుని ఏపీ వాళ్ళు రావద్దంటే ఎలా ఉంటుందన్నారు.  తెలంగాణ ప్రజా ప్రతినిధుల బాధలను అర్థం చేసుకొని సిఫారసు లేఖలను అనుమతించాలని కోరుతున్నా మన్నారు. తమ విజ్ఞప్తిని పరిశీలించక పోతే డిసెంబర్ లో జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో భాయ్ కాట్ నిర్ణయం తీసుకుంటే బాధపడాల్సి వస్తుందన్నారు. అన్నదమ్ములుగా ఉందామన్నారు.

ఇవి కూడా చదవండి

వ్యాపారాల కోసమే తెలంగాణకు రావద్దనీ, తెలంగాణ ప్రజలు తిరుమల దర్శనానికి వస్తే అనుమతించేలా చూడాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కోరారు. రాష్ట్రం రెండుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటున్నారని ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ గుర్తు చేశారు. ఇద్దరు సీఎం లు రెండు తెలుగు స్పీకింగ్ స్టేట్స్ గానే ఉండాలన్నారన్నారు. తెలంగాణలోని ప్రజలు, ప్రజా ప్రతినిధులు అందరూ కూడా తిరుమల క్షేత్రం తమ రాష్ట్రంలోనే ఉందని భావిస్తారన్నారు. అయితే తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల లెటర్లను స్వీకరించమని టీటీడీ చెబుతోందన్నారు. టిటిడి వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు ఎమ్మెల్సీ వెంకట్. సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు తగిన గౌరవం ఇవ్వాలని కోరుతున్నామన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరు వెంకట్.

తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ నేతలు ఇచ్చిన సిఫార్సు లేఖల్ని టీటీడీ అనుమతించకపోవడంపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ తీరుపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమలలో తెలంగాణ నాయకులపై ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. ఏపీ నేతలు తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవడం లేదా…? అని కొశ్చన్‌ చేశారు. తిరుమలలో తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు.

మరిన్ని రాజకీయ వార్తల కోసం క్లిక్ చేయండి..