మంత్రాల నెపంతో ఘోరం..సొంత బాబాయినే హతమార్చిన కిరాతకం..

విషయం తెలుసుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రాణా ప్రతాప్ సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని చెక్ డ్యాం నుండి వెలికి తీసి హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించి, మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చరికి తరలించారు.

మంత్రాల నెపంతో ఘోరం..సొంత బాబాయినే హతమార్చిన కిరాతకం..
Black Magic
Follow us
N Narayana Rao

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 22, 2024 | 12:00 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.  మంత్రాల నెపతో ఓ వ్యక్తిని అతి దారుణంగా హతమార్చారు. మం త్రగాడు, చేతబడులు చేస్తాడనే నెపంతో సొంత బాబాయిని మరో వ్యక్తితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రాచబండ్ల కోయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. పూర్త వివరాల్లోకి వెళితే..

జూలూరుపాడు మండలం రాచబండ్ల కోయగూడెం గ్రామానికి చెందిన కుంజా బిక్షం (40) అనే వ్యక్తిని సొంత అన్న కొడుకు కుంజా ప్రవీణ్, వరుసకు మామ అయిన మల్కం గంగయ్య ఇద్దరూ కలిసి భిక్షాన్ని గత రాత్రి మద్యం సేవించేందుకు గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్దకు తీసుకువెళ్లారు. మద్యం సేవించిన అనంతరం ప్రవీణ్ గంగయ్య ఇద్దరు కలిసి బిక్షం ముఖంపై రాయితో కొట్టి హత్య చేసి వాగులో పడేసారు.

అయితే, మృతి చెందిన బిక్షం మంత్రగాడు, చేతబడులు చేస్తాడని తమ కుటుంబ సభ్యులకు కూడా గత కొంతకాలంగా ఆరోగ్యపరంగా బాగా ఉండటం లేదని అందుకు బిక్షం చేతబడి చేయడం వల్లే తమ కుటుంబ సభ్యులకు ఇలా జరిగిందని కక్ష పెంచుకొని హత్య చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, బిక్షం కుటుంబ సభ్యుల వాదన మాత్రం మరోలా ఉంది. బిక్షం మంత్రగాడు కాదని అతనికి ఎలాంటి చేతబడులు రావని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి హత్యకు గల కారణాలను నిర్ధారించి నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే మృతుడు గతంలో ఫారెస్ట్ వాచరుగా పనిచేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రాణా ప్రతాప్ సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని చెక్ డ్యాం నుండి వెలికి తీసి హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించి, మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చరికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయని సిఐ తెలిపారు. నిందితులు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..