పెళ్లి కావడం లేదని.. తండ్రిని చంపిన కొడుకు.. కట్‌చేస్తే ఇలా దొరికిపోయాడు..!

ఇక ఆ మర్నాడు ఉదయం స్థానిక డాక్టర్‌ని పిలిపించి తన తండ్రి లేవడం లేదని చూపించాడు..అమృతాన్ని పరీక్షించిన డాక్టర్‌ అతను చనిపోయినట్లుగా ధ్రువీకరించాడు. అమృతానిది సహజ మరణంగా చిత్రీకరించిన మహిపాల్‌ బంధువులకు సమాచారమిచ్చాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా

పెళ్లి కావడం లేదని.. తండ్రిని చంపిన కొడుకు.. కట్‌చేస్తే ఇలా దొరికిపోయాడు..!
Crime
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 22, 2024 | 8:20 AM

తనకు పెళ్లి కావడం లేదని ఓ కొడుకు తన తండ్రిని చంపిన దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నవీపేట్‌ మండలం అనంతగిరికి చెందిన మహిపాల్‌ తన తండ్రి గౌరు అమృతాన్ని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత సహజమరణంగా నమ్మించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా కథ అడ్డం తిరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు మహిపాల్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతర గిరి గ్రామానికి చెందిన గౌరు అమృతం కుమారుడు గౌరు మహిపాల్‌ గత కొంతకాలంగా దుబాయ్‌లో ఉంటున్నాడు.. ఇటీవలే దుబాయి నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. మహిపాల్‌ ఇంటికి వచ్చేసరికి తన తల్లి తండ్రి నుంచి విడిపోయి దూరంగా ఉంటోందని తెలిసింది. ఈ క్రమంలోనే తన తండ్రి అమృతం తన పశువులను కూడా అమ్ముకున్నాడని తెలిసింది. తల్లిని వేరుగా ఉంచడం, తనకు పెళ్లి చేయకపోవడం, పశువులు అమ్ముకోవడంతో తండ్రిపై మహిపాల్‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇలాంటి తండ్రి లేకపోవటమే మంచిదని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తండ్రీకొడుకులు మద్యం సేవించారు. అమృతం మత్తులోకి జారుకోవడంతో అతడి గొంతుకు టవల్‌ బిగించి హత్య చేశాడు.

ఇక ఆ మర్నాడు ఉదయం స్థానిక డాక్టర్‌ని పిలిపించి తన తండ్రి లేవడం లేదని చూపించాడు..అమృతాన్ని పరీక్షించిన డాక్టర్‌ అతను చనిపోయినట్లుగా ధ్రువీకరించాడు. అమృతానిది సహజ మరణంగా చిత్రీకరించిన మహిపాల్‌ బంధువులకు సమాచారమిచ్చాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అమృతం మెడపై గాయాలను గమనించిన బంధువులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమదైన స్టైల్లో మహిపాల్‌ను విచారించగా తండ్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసినట్టుగా నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సీఐ సతీశ్‌, ఎస్సై వినయ్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!