AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. రూ. 250 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్

ఈ తనిఖీలో రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు రూ.14.10 లక్షల విలువైన 141 గ్రాముల ఎండీ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. 427 కిలోల అనుమానిత డ్రగ్స్‌ను టెస్టుల కోసం ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్టుగా సమాచారం.

గుజరాత్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. రూ. 250 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్
Drugs
Jyothi Gadda
|

Updated on: Oct 22, 2024 | 7:41 AM

Share

గుజరాత్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపింది. అధికారుల తనిఖీల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. గుజరాత్ పోలీసులు డ్రగ్స్‌పై నిర్వహించిన ఆపరేషన్‌లో 400 కిలోలకు పైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. భరూచ్‌ జిల్లా అంక్‌లేశ్వర్‌ జీఐడీసీ ప్రాంతంలోని అవ్‌సర్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో సూరత్‌, భరూచ్‌ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు రూ.14.10 లక్షల విలువైన 141 గ్రాముల ఎండీ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. 427 కిలోల అనుమానిత డ్రగ్స్‌ను టెస్టుల కోసం ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్టుగా సమాచారం.

పక్కా సమాచారం మేరకు జిల్లా ఎస్‌ఓజీ, సూరత్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్టు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అధికారి ఆనంద్ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురి అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపినట్టుగా చెప్పారు.

కాగా, అక్టోబరు 13న ఇదే ఫ్యాక్టరీకి సమీపంలోని అవ్కార్ అనే కర్మాగారంలో గుజరాత్, ఢిల్లీ పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో రూ. 5,000 కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకులో 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి కూడా ఉన్నట్టు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!