- Telugu News Photo Gallery Drinking curry leaves water on an empty stomach can have many health benefits
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి.. కొద్దిరోజుల్లోనే మీ బాడీలో ఊహించని మార్పులు!
దాదాపు గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఉండే పెరటి మొక్క కరివేపాకు.. ఇది వంట రుచిని పెంచడమే కాదు..ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కరివేపాకు దివ్యౌషధంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే, కరివేపాకు నానబెట్టిన నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల చాలా వ్యాధులు నయమవుతాయని, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు నానబెట్టిన నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Oct 22, 2024 | 7:18 AM

కొంతమంది జీర్ణ రుగ్మతలతో బాధపడుతుంటారు. అందుకు క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. అయితే కరివేపాకు నానబెట్టిన నీళ్లను తాగితే మాత్రం రకరకాల కడుపు సమస్యలు నయమవుతాయి. పైగా కరివేపాకు మలబద్ధకం నయం చేయడంలోనూ సహాయపడుతుంది

కరివేపాకులో నానబెట్టిన నీరు శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను సహజ పద్ధతిలో తొలగించడానికి సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన ఈ విషపదార్థాలను తొలగించగలిగితే పొట్ట, చర్మం, జుట్టు మొదలుకుని అన్ని సమస్యలూ నయమవుతాయి. అధిక శరీర బరువు కూడా తగ్గుతుంది.

కరివేపాకులో కార్బజోల్, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇది శరీరం నుండి అదనపు కొవ్వును తొలగించడానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఆహారం, వ్యాయామంతో పాటు, కరివేపాకులను క్రమం తప్పకుండా ఉదయం ఖాళీ కడుపుతో లేదంటే వంటలో తినడం వల్ల కొవ్వు వేగంగా తగ్గుతుంది. అలాగే బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

ఈ కరివేపాకు కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, కొవ్వు తగ్గడం వంటి వివిధ శరీర వ్యాధులకు ఉపయోగిస్తారు. వంటకే కాదు నీళ్లలో కలిపి డిటాక్స్ డ్రింక్ కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకును రోజూ తింటే గుండె సమస్యలు దూరమవుతాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. కరివేపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో 'చెడు' కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌ల స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

Curry Leaves




