- Telugu News Photo Gallery Cinema photos Actress anjali latest vacation photos goes viral on social media
Anjali: విదేశీ వీధుల్లో వయ్యారి భామ.. అంజలి లేటెస్ట్ ఫోటోస్ వైరల్
Updated on: Oct 21, 2024 | 10:34 PM

హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో 50కి పైగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

తొలి సినిమాలోనే టేక్ లేకుండా డైలాగ్ చెప్పి సెట్‌లో చప్పట్లు అందుకుందట ఈ అమ్మడు. ఫోటో అనే సినిమాతో పరిచయం అయ్యింది అంజలి. ఆతర్వాత వరుసగా తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా. 2012లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ఆకట్టుకుంది అంజలి.

ప్రస్తుతం ఈ భామ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాలో చరణ్ భార్యగా కనిపించనుంది అంజలి. ఇటీవలే ఆమె నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా విడుదలైంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అంజలి రెగ్యులర్ గా ఫోటోషూట్ లు షేర్ చేస్తుంది. సినిమా అప్డేట్స్ తో పాటు తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. విదేశాలకు వెళ్లిన ఈ భామ అక్కడి వీధుల్లో విహరిస్తోంది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.




