Sweet Potato: చిలకడదుంపలు తింటే కలిగే మేలేంటో తెలిస్తే.. ఇక వదిలిపెట్టరు..!
చిలగడదుంప అనేది దుంప జాతికి చెందిన ఆహారం. ఈ దుంపలను ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇందులో విటమిన్‌లు, ఫైబర్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలను, చక్కెరలను కలిగి ఉండే ఈ ఆహార పదార్థం రుచిని కూడా కలిగి ఉంటుంది. వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు తెలిస్తే ఎవరూ దానిని వదిలిపెట్టరు.
Updated on: Oct 21, 2024 | 1:22 PM

జీర్ణక్రీయవ్యవస్థను మెరుగుపరచడంలో కూడా చిలగడదుంప ఎంతగానో ఉపయోగపడుతుంది. చిలగడదుంపలు కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను తొలగించడంలో సహాయపడుతాయి.

చిలగడదుంపలతో వివిధ రకాల వంటలు చేసుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చిలగడదుంపలు ఎంతో ఉపయోగపడుతాయి. చిలగడదుంపలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు. ఏదైనా కొత్త ఆహారాన్ని ప్రయత్నించే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం ముఖ్యం.

చిలకడ దుంప తీసుకోవటం వల్ల శరీర రక్తంలో తెల్ల రక్తకణాలను, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అధికం చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. విటమిన్ 'డి'ని పుష్కలంగా ఉండటం వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, మానసిక కల్లోలాలను తగ్గించి, శక్తిని పెంచి, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది.

చిలగడదుంప తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. గుండె కండరాలు బలంగా ఉండేలా నిర్మిస్తుంది. చిలకడదుంప పొటాషియంను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది హృదయ స్పందన మరియు నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిరులను పొటాషియం తగ్గిస్తుంది.

చిలకడదుంప పుష్కలమైన విటమిన్ 'సి' కలిగి ఉండి, జలుబు, ఫ్లూలను తగ్గించటమే కాకుండా, దంతాలు, ఎముకల ఏర్పాటు, రక్త కణాల మరియు కొల్లజన్ ఉత్పత్తిలను పెంచుతుంది. కొల్లాజన్ చర్మ కణాలకు స్టితిస్థాపకతను చేకూర్చి ఒత్తిడి మరియు క్యాన్సర్ వ్యాధిని కలుగచేసే కారకాల చర్యలను అడ్డుకుంటుంది. పొట్టలో ఏర్పడే అల్సర్‌లను తగ్గించి వేస్తాయి.




